సాధారణంగా సెల్ఫీలు తీసుకోవడం నాకిష్టం వుండదన్నారు సమంత. కానీ.. సెల్ఫీ మాత్రం తీసుకున్నారు. అదీ ముద్దుల శ్రీవారు నాగచైతన్యతో. ఇష్టం లేదనప్పుడు ఎందుకు తీసుకున్నారు? అంటే… ఎనిమిదేళ్ల క్రితం అంతా ఇక్కడే మొదలైంది. మా జీవితాల్లో దీనికి ప్రత్యేక స్థానం వుంది. అటువంటి ప్రదేశంలో ఒక్క సెల్ఫీ తీసుకోవాలి కదా అంటున్నారు. అంత స్పెషల్ ప్లేస్ ఎక్కడ వుంది? అంటే… అమెరికాలోని సెంట్రల్ పార్క్. నాగచైతన్య, సమంత జంటగా నటించిన మొదటి సినిమా ‘ఏ మాయ చేసావె’లో క్లైమాక్స్ సీన్ తీసింది అక్కడే. ప్రస్తుతం అమెరికా హాలిడే ట్రిప్ లో వున్న వీరిద్దరూ సెంట్రల్ పార్కుకి వెళ్లారు. సరదాగా చాలాసేపు తిరిగి స్పెషల్ సెల్ఫీలు తీసుకున్నారు. సమంత నటించిన తాజా చిత్రం ‘రంగస్థలం’ శుక్రవారం విడుదలైంది. అందులో సమంత నటనకు సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. దీనిపై సమంత సంతోషం వ్యక్తం చేశారు.