ఓ సినిమాకి టీజర్ కట్ చేయడం అంత ఈజీ కాదు. సినిమా సగం పూర్తయినా టీజర్ బయటకు రాదు. టీజర్లో చాలా విషయాలు చెప్పాలని, వీలైనంత ఫుటేజీ వచ్చేంత వరకూ దర్శకులు ఎదురుచూస్తుంటారు. అలాంటిది కేవలం 11 రోజులు షూటింగ్ చేసి, ఓ టీజర్ వదిలింది ‘తండేల్’ బృందం.
నాగచైతన్య – చందూ మొండేటి కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ‘తండేల్’. సాయి పల్లవి కథానాయిక. గీతా ఆర్ట్స్ ఇటీవలే సెట్స్‌పైకి వెళ్లింది. కొత్త సంవత్సరంలో ఏదో ఓ అప్ డేట్ ఇవ్వాలన్న సంకల్పంతో టీజర్ కట్ చేశారు. తండేల్ వరల్డ్ మొత్తం ఈ టీజర్లో చూపించే ప్రయత్నం చేశారు. హీరో క్యారెక్టరైజేషన్, స్ట్రగుల్, తన లవ్ స్టోరీ ఇవన్నీ కవర్ అయ్యేలా టీజర్ కట్ చేశారు. ఈ టీజర్‌కి మంచి స్పందన వస్తోంది. తక్కువ టైమ్ లో ఇంత ఫుటేజీ తీసి, అందులోంచి టీజర్ కట్ చేయడం అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి. ఈ విషయంలో చందూ మొండేటికి పూర్తి మార్కులు పడిపోతాయి. సాధారణంగా టీజర్ కోసమే కొంత బడ్జెట్ కేటాయించి, టీజర్ కోసమే షూట్ చేస్తుంటారు. కానీ.. ‘తండేల్’ విషయంలో అలా కూడా జరగలేదు. సినిమాని ప్రోపర్గా షూట్ చేసి, అందులోని ఫుటేజీ నుంచే టీజర్ కట్ చేశారు. చైతూ లుక్, ప్రొడక్షన్ వాల్యూస్… ఇవన్నీ బాగా ఇంప్రెస్ చేస్తున్నాయి. ఈ సినిమా కోసం చిత్రబృందం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చాలా పకడ్బందీగా చేసింది. ఓ సినిమా ప్రీ ప్రొడక్షన్ కోసం ఇంతలా ఎప్పుడూ కష్టపడలేదు అని అల్లు అరవింద్ స్వయంగా చెప్పారు. అందుకే..అవుట్ పుట్ కూడా దానికి తగ్గట్టుగానే వచ్చింది.