రీమిక్స్ సంప్రదాయం కొనసాగుతూనే ఉంది. స్టార్ తనయులు… వారసత్వంగా పాటల్నీ వాడేసుకుంటున్నారు. ఫ్యాన్స్‌ని అలరిస్తున్నారు. తాజాగా నాగచైతన్య కూడా రీమిక్స్ బాట పట్టాడు. చైతూ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం సవ్యసాచి. ఇందులో నాగ్ పాటని రీమిక్స్ చేస్తున్నారు. నాగ్ నటించిన ‘అల్లరి అల్లుడు’ గుర్తుంది కదా, అందులో పాటలన్నీ హిట్టే. వాటిలోంచి ‘నిన్ను రోడ్డుమీది చూసీనదీ లగ్గా ఎత్తు.. నేను రోమియోగా మారినదీ లగ్గాయెత్తు’ అనే పాటని రీమిక్స్ చేస్తున్నారు. ఈ పాటలో ఓ ప్రముఖ కథానాయిక చైతూతో ఆడిపాడనుంది. ఆమె ఎవరన్నది త్వరలో తెలుస్తుంది. చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయిక. చిత్రీకరణ ముగింపు దశకు చేరుకుంది. ఈ వేసవిలోనే విడుదల చేయడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.