ప్రస్తుతం ‘తండేల్’ సినిమాతో ఊపిరి సలపనంత బిజీగా ఉన్నాడు నాగచైతన్య. ఆ తరవాత ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. స్క్రిప్టు పనులు దాదాపుగా పూర్తయ్యాయి. ఇప్పుడు నటీనటులు ఇతర సాంకేతిక నిపుణుల కోసం ఎంపిక జరుగుతోంది. ఈ చిత్రంలో కథానాయికగా మీనాక్షి చౌదరిని ఎంచుకొన్నట్టు ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. చైతూ పక్కన నటించడం మీనాక్షికి ఇదే తొలిసారి. ఈ కాంబో ఫ్రెష్ గా ఉంటుందని చిత్రబృందం భావిస్తోంది. ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయికగా నటించబోతోందని కూడా వార్తలు వస్తున్నాయి. దాంతో ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉండబోతున్నట్టు ఫిక్సయింది.
మీనాక్షి ఈ యేడాదంతా బిజీ బిజీగా గడుపుతోంది. సంక్రాంతికి ‘గుంటూరు కారం’ విడుదలైంది. ఆ సినిమాలో తనది పెద్దగా గుర్తింపు ఉన్న పాత్ర కాదు. మరదలుగా సర్దుకుపోయింది. ఇటీవల ‘లక్కీ భాస్కర్’ విడుదలైంది. మొన్నే మట్కా వచ్చింది. ఈవారంలో విడుదల అవుతున్న ‘Mechanic Rocky’ లో కూడా తనే కథానాయిక. 2025 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’లో కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ బిజీయెస్ట్ కథానాయిక తను. తన చేతిలో ఇప్పుడు మరో నాలుగు సినిమాలున్నాయి. వాటిలో చైతూ సినిమా కూడా చేరిపోయిందిప్పుడు.