సమంతతో విడిపోవడంపై కీలక వాఖ్యలు చేశారు నాగచైతన్య. ఓ పాడ్ కాస్ట్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని పర్శనల్ విషయాలు గురించి తన మనసులో మాట చెప్పారు. తన డివోర్స్ కొందరికి ఎంటర్టైన్మెంట్ అయిపొయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
”నేను, సమంత పరస్పర గౌరవం, అంగీకారంతో విడిపోయాం. అప్పుడే ఓ ప్రకటన కూడా విడుదల చేశాం. కానీ కొందరికి ఆ ప్రకటన సరిపోలేదు. ఇంకా వివరణ కావాలని నిరంతరం ఏవో కథనాలు రాస్తూనే వున్నారు. నా డివోర్స్ కొందరికి ఎంటర్టైన్మెంట్ అయిపొయింది. నాకు అది చాలా సెన్సిటివ్ విషయం. నేను ఒక బ్రోకెన్ ఫ్యామిలీ నుంచే వచ్చాను. అలాంటి నిర్ణయం తీసుకోవాలంటే ఒకటికి వెయ్యిసార్లు అలోచించి వుంటాను. కానీ కొందరు మా ప్రైవసీని గౌరవించలేదు. నన్ను ఏదో క్రిమినల్ లా చూశారు. ప్రపంచంలో నా ఒక్కడికే విడాకులు జరిగినట్లు మాట్లాడుతున్నారు. నేను ఎప్పుడో దాని నుంచి బయటకి వచ్చేశాను. మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. కానీ కొందరు నా విడాకులనే కెలుకుతున్నారు. ఇందులో శోభితపై కూడా విమర్శలు చేయడం నన్ను బాధిస్తుంది, పాపం.. దీనితో తనకి ఎలాంటి సంబంధం లేదు’ అని చెప్పుకొచ్చారు చైతు.
ఇదే సందర్భంలో నెపోటిజం గురించి మాట్లాడారు. ఒక డాక్టర్ కొడుకు డాక్టర్ అయితే తప్పుగా కనిపించదు. కానీ యాక్టర్ కొడుకు యాక్టర్ అయితేనే సమస్య. నిజానికి నెపోటిజం ఇండస్ట్రీలో వర్క్ అవుట్ కాదు. నేను ఓ స్టార్ కొడుకు కావడంతో కొన్ని అవకాశాలు వుంటాయి. దర్శకులు, నిర్మాతలని కలిసే అవకాశం వుంది. కానీ బరిలో దిగిన తర్వాత అంతిమంగా నేను, సినిమా నచ్చాలి. నా సినిమాతో పాటు మరో కొత్త హీరో సినిమా ఒకేసారి రీలీజైతే నేను స్టార్ కిడ్ నని నా సినిమా చూడరు. బావుంటేనే చూస్తారు. ఓవర్ నైట్ లో ఫేం తలకిందులైన బోలెడు సందర్భాలు చూశాను. ఓ కొత్త హీరో సినిమాతో పాటు నా సినిమా రీలీజై డిజాస్టర్స్ వచ్చిన సందర్భాలు చాలా వున్నాయి. నిజంగా నెపోటిజం వుంటే నా సినిమా ఆడాలి కదా? ఇక్కడ కష్టపడి, జనాలు మెచ్చితేనే వుంటాం’ అని చెప్పుకొచ్చారు చైతు.
పీఆర్ పై చైతు చేసిన కామెంట్స్ కూడా ఆసక్తికరంగా వున్నాయి. ‘ఇండస్ట్రీలో పీఆర్ గేమ్ లోకి నేను లేట్ గా వచ్చాను. సినిమా వున్నా లేకపోయినా నెలకి సుమారు మూడు లక్షల పీఆర్ కి ఖర్చు చేయకపొతే మనల్ని స్టుపిడ్ అనుకోవాలి. ఇక్కడ మనపై నెగిటివ్ పీఆర్ చేసే వ్యక్తులు కూడా వుంటారు. మనల్ని మన సినిమాని తొక్కేయాలని చూస్తారు. అందులో వాళ్ళ ఆనందం ఏమిటో నాకు అర్ధం కాదు. ఆ డబ్బు, సమయాన్ని వాళ్ళ ఎదుగుదల కోసం వాడుకుంటే మంచిది’ అని సలహా ఇచ్చారు చైతు.