ఊహలు గుసగుసలాడే సినిమాతో ఎంట్రీ ఇచ్చి వరుసెంట సినిమాలను చేస్తూ.. విజయబాటలో వెళ్తూ.. యూత్ లో తనకంటూ ఓ స్పెషల్ క్రేజ్ ను సంపాధించిన కుర్ర హీరో నాగశౌర్య. ఇంతకుముందు కూడా తాను నాగార్జున, ఎన్.టి.ఆర్ లకు పెద్ద అభిమాని అని చెప్పాడు. అలానే ఈరోజు విడుదలైన యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ నాన్నకు ప్రేమతో సినిమా గురించి తన మార్క్ ఎమోషనల్ స్పీచ్ ఇచ్చాడు.
ఎన్.టి.ఆర్ 25వ సినిమాగా వచ్చిన నాన్నకు ప్రేమతో సినిమా భారీ అంచనాలతో భారీ రేంజ్ లో విడుదల అయ్యింది. సినిమా చూసిన నాగశౌర్య.. నాన్నకు ప్రేమతో సినిమా చాలా బాగుంది.. ఇది ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్ సినిమా కాదు కాని.. ఫ్యామిలీ మొత్తం చూడాల్సిన సినిమా.. ఒకవేళ ఈ సినిమా ఫ్యామిలీస్ చూడకపోతే చాలా మిస్ అవుతాం అని అంటున్నాడు. తాను ఎన్.టి.ఆర్ వీరాభిమానిగా ఇదంతా చెబుతున్నది కాదని ఓ నాన్నను ప్రేమించే కొడుకుగా తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచానని అన్నాడు.
అంతేకాదు చివరగా తాను చెప్పింది సినిమా రివ్యూ కాదని.. అయినా నాన్నకు విలువ కట్టలేం కదా..! అంటూ తానో సెంటిమెంట్ డైలాగ్ కొట్టి వారెవా అనిపించుకున్నాడు. మరి నాగశౌర్య ఇచ్చిన ఈ కామెంట్ బట్టే సుకుమార్ నాన్నకు ప్రేమతో సినిమా ఏ రేంజ్ లో తీశాడో అర్ధం చేసుకోవచ్చు. ఈరోజు విడుదలైన నాన్నకు ప్రేమతో అన్ని చోట్ల పాజిటివ్ రివ్యూస్ అందుకుంది. సినిమా వసూళ్లు కూడా భారీగా రాబట్టింది అని ట్రేడ్ న్యూస్. మరి కొన్నిగంటల్లో మొదటిరోజు ఎంత కలెక్ట్ చేసింది అన్నది ఒక ఫిగర్ అంచనాకు వచ్చే ఛాన్స్ ఉంది.