ఒక మనసు ఇంకొన్ని గంటల్లో థియేటర్లలో సందడి చేయబోతోంది. ఒక మనసు అనగానే టాపిక్ నిహారిక వైపు మళ్లుతోంది. నిహారిక ఎలా చేసింది, టాప్ హీరోయిన్లకు పోటీ ఇస్తుందా? నటనలో ఎన్ని మార్కులు పడతాయి? అనే విషయాలపైనే చర్చించుకొంటున్నారు. ఈ సినిమాకి ఓపెనింగ్స్ ఎన్నొచ్చినా అది నిహారిక చలవే అన్నట్టు మాట్లాడుకొంటున్నారు. తన గురించి ఎవ్వరూ మాట్లాడుకోవడం లేదని నాగశౌర్య అలిగాడని ఫిల్మ్నగర్లో గుసగుసలు వినిపించాయి. ఈ సినిమా ప్రమోషన్ల గురించి కూడా శౌర్య పట్టించుకోవడం లేదన్నట్టు మాట్లాడారు. వీటిపై నాగశౌర్య స్పందించాడు.
”నాకు ఎలాంటి అభద్రతా భావం లేదు. నా గురించి మాట్లాడుకొంటున్నారా, లేదా అనే విషయాన్ని నేను పట్టించుకోను. ఓ సినిమాలో నటించిన హీరోయిన్ గురించి మాట్లాడుకొంటే తప్పేంటి? దానివల్ల కూడా సినిమాకి మంచే జరుగుతుంది కదా? పైగా నిహారిక చిరంజీవి గారి ఇంటి నుంచి వచ్చిన అమ్మాయి. తనపై ఆ మాత్రం ఫోకస్ ఉండడంలో తప్పులేదు” అంటూ క్లారిటీ ఇచ్చాడు శౌర్య.