‘రంగబలి’ తర్వాత నాగశౌర్య నుంచి కొత్త సినిమా ప్రకటన రాలేదు. నిజానికి ఆ సినిమా ఫలితం శౌర్యలో ఒకరకమైన అసహనం నింపంది. ఆ సినిమాని విమర్శకులు రిసీవ్ చేసుకున్న తీరుపై ఓపెన్ గానే తన అసంతృప్తి వెళ్ళగాక్కాడు శౌర్య.
నిజానికి రంగబలి ఓ మాదిరి సినిమానే. దాదాపు ఫస్ట్ హాఫ్ అంతా థియేటర్ ని నవ్వించింది. ముఖ్యంగా సత్య కామెడీ బాగా పేలింది. అయితే సెకండ్ హాఫ్ మాత్రం తేడా కొట్టేసింది. కామెడీని నడిపినంత నేర్పుగా కథని నడపలేకపోవడంతో పాయింట్ తేలిపోయింది.
అయితే పోయిన చోటే వెతుక్కోవాలనే మాట ప్రకారం.. శౌర్య మరోసారి రంగబలి దర్శకుడు పవన్ బాసంశెట్టితో జతకడుతున్నాడు. రంగబలి ఫలితం తేడాకొట్టిన పవన్ ప్రతిభపై నమ్మకంగా వున్నాడు శౌర్య. రంగబలిలో శౌర్యని చాలా యూత్ ఫుల్, మాసీగా ప్రజెంట్ చేశాడు పవన్. తనలో కామెడీ టైమింగ్ కూడా బావుంది. సెకండ్ హాఫ్ లో కథ నడిపినప్పుడే అసలు ఇబ్బంది వచ్చింది. అయితే ఈసారి గత తప్పులు పునరావృతం కాకుండా ఖచ్చితంగా హిట్ కొట్టాలని నిర్ణయించుకొని మరోసారి ఈ కాంబో ఫైనల్ అయ్యింది. త్వరలోనే ఈ సినిమాపై అధికారిక ప్రకటన రాబోతుంది.