హిట్ పెయిర్ కి టాలీవుడ్లో భలే గిరాకీ! ఓ సినిమా హిట్టయితే చాలు, ఆ జంటతో మళ్లీ మళ్లీ సినిమాలు చేయడానికి రెడీ అయిపోతారు దర్శక నిర్మాతలు. అయితే ఒక్క సినిమా కూడా విడుదల కాకుండానే హిట్ పెయిర్ అనిపించేసుకొంటున్నారు నాగశౌర్య, నిహారిక. వీళ్లిద్దరూ కలసి నటించిన ఒక మనసు విడుదలకు సిద్ధంగా ఉంది. ఈలోగా వీరిద్దరితో ఓ సినిమా చేయడానికి నిర్మాత, దర్శకుడు రెడీ అయిపోయినట్టు టాక్. ఆఖరికి సినిమా చూడకుండానే వీళ్లిద్దరి చేతుల్లో కంబైన్డ్‌గా అడ్వాన్సులు పెట్టేశారట. ఒక మనసుతో ఇంకా విడుదల కాకుండానే ఈ జంటకు క్రేజ్ పెరిగిందంటే, ఆ సినిమా బయటకు వస్తే, ఇంకేరేంజులో ఉంటారో…?
అయితే ఒక మనసుతో సినిమా సమయంలో.. నిహారికకు, నాగశౌర్యకు మధ్య క్లాష్ వచ్చిందని, ఇద్దరికీ అస్సలు పడడం లేదని చెప్పుకొన్నారు. నిహారిక పబ్లిసిటీ విషయంలో షరతులు పెడుతుందన్న మాటలూ వినిపిస్తున్నాయి. నిహారిక పాత్రకెక్కువ ప్రాధాన్యం ఇచ్చారని, తనని ఆటలో అరటిపండు చేశారని నాగశౌర్య ఫీలయ్యాడని గుసగుసలాడుకొన్నారు. వీటి మధ్య మరోసారి వీరిద్దరూ జత కట్టడం ఆశ్చర్యమే. మరి ఈ సినిమాకి దర్శకుడెవరో, ఎప్పుడు పట్టాలెక్కుతుందో తేలాలంటే ఇంకొన్ని రోజులు ఎదురుచూడాలి.