ఇటీవలే ఓ షూటింగ్లో నాగశౌర్య గాయపడిన సంగతి తెలిసిందే. వైజాగ్లో ఓ ఛేజింగ్ సన్నివేశం తెరకెక్కిస్తున్నప్పుడు నాగశౌర్య కాలు బెణికింది. దాంతో… షూటింగ్ కి అర్థాంతరంగా దూరం అవ్వాల్సివచ్చింది. శౌర్య ఇంకా గాయం నుంచి కోలుకోలేదు. కానీ.. మళ్లీ షూటింగ్ మొదలెట్టేశాడు. మిగిలిన నటీనటుల డేట్లు క్లాష్ వస్తున్నందు వల్లే.. నాగశౌర్య గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోయినా సెట్లోకి అడుగుపెట్టాల్సివచ్చిందని చిత్రబృందం తెలిపింది. ఈసారి రన్నింగులూ, ఛేజింగులూ లాంటివేం పెట్టుకోకుండా కొన్ని కీకల సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు. ఐరా ప్రొడక్షన్స్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి శౌర్యనే నిర్మాత. ‘అశ్వద్ధామ’ అనే పేరు ఈ సినిమా కోసం పరిశీలిస్తున్నారు.