శౌర్య చేసిన ప‌నికి ఫ్యాన్స్ అయిపోయిన హీరోయిన్లు

నాగ‌శౌర్య‌లోని రియ‌ల్ హీరో బ‌య‌టకు వ‌చ్చాడు. న‌డిరోడ్డుపై అమ్మాయిని చేయి చేసుకొన్న ఓ యువ‌కుడ్ని నిల‌దీసిన నాగ‌శౌర్య నెటిజ‌న్ల మ‌న‌సుల్ని గెలుచుకొన్నాడు. మంగ‌ళ‌వారం హైద‌రాబాద్‌లో… న‌డిరోడ్డుపై ఓ యువ‌తిని ఓ యువ‌కుడు కొట్ట‌డం.. శౌర్య గ‌మ‌నించాడు. ఆ స‌మ‌యంలో కారులో వెళ్తున్న శౌర్య‌, వెంట‌నే కింద‌కి దిగి… ఆ యువ‌కుడ్ని అడ్డుకున్నాడు. అంతే కాదు.. రోడ్డుపై అమ్మాయిని ఎందుకు కొడుతున్నావ్‌? అంటూ నిల‌దీశాడు. `మేమిద్ద‌రం ల‌వ‌ర్స్‌` అని ఆ అబ్బాయి చెప్పినా శౌర్య శాంతించ‌లేదు. ల‌వ‌ర్ అయితే కొడ‌తావా? అంటూ మ‌రింత గ‌ట్టిగా అడ‌గ‌డంతో.. చివ‌రికి ఆ అమ్మాయికి అబ్బాయి సారీ చెప్పాడు. నిజానికి ఇదంతా.. ఫ్రాంక్ వీడియోనో, సినిమా ప్ర‌మోష‌న్ కోస‌మో చేశార‌నుకొన్నారంతా. కానీ.. అది రీల్ కాద‌ని, రియ‌ల్ అని ఆ త‌ర‌వాత అర్థ‌మైంది. దాంతో.. శౌర్య చేసిన ప‌నికి సోష‌ల్ మీడియాలో పాజిటీవ్ రెస్పాన్స్ వ‌స్తోంది. శౌర్య మంచి ప‌ని చేశాడంటూ అంతా అభినందిస్తున్నారు. ఈ విష‌యంలో ఇండ‌స్ట్రీ వ్య‌క్తుల మ‌న‌సుల్నీ గెలుచుకొన్నాడు నాగ‌శౌర్య‌. ముఖ్యంగా హీరోయిన్లు కొంత‌మంది శౌర్య‌కు ఫ్యాన్స్ అయిపోయారు. కొంత‌మంది క‌థానాయిక‌లు శౌర్య‌కు ఫోన్ చేసి.. అభినందిస్తున్నార‌ట‌. మొత్తానికి తెర మీదే కాదు… బ‌య‌ట కూడా తాను రియ‌ల్ హీరోనే అనిపించుకొన్నాడు నాగ‌శౌర్య‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డి-ఏజింగ్… లాభమా? నష్టమా ?

సినిమాలో ఒక క్యారెక్టర్ బాల్యం, యవ్వనం, కౌమార, ప్రౌడ దశలని చూపించడం ఫిల్మ్ మేకర్స్ కి పెద్ద సవాల్. ఇందుకోసం హలీవుడ్ నుంచి కూడా మేకప్ మ్యాన్ లని దిగుమతి చేసుకునే వారు....

దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో దివ్వెల మాధురీ !

దువ్వాడ ఫ్యామిలీ డ్రామాలో కొత్త కొత్త ఎపిసోడ్లు ప్రారంభమవుతున్నాయి. కొద్ది రోజుల పాటు సైలెంట్ గా ఉంటానని చెప్పిన దివ్వెల మాధురీ.. ఒక్క సారిగా.. ఏకంగా దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోనే ప్రత్యక్షమయ్యారు. దువ్వాడ...

ఆ పడవలు నందిగం సురేష్ తాలూకానే !

ప్రకాశం బ్యారేజీకి వరద వస్తే ఈ మధ్య బోట్లు కొట్టుకు వస్తున్నాయి. బ్యారేజని డ్యామేజ్ చేస్తున్నాయి. అవి ఎలా వస్తున్నాయో తెలియడం లేదు. ఇప్పుడు మిస్టరీ బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ రంగులేసిన...

శభాష్ నిమ్మల… అభినందించిన నారా లోకేష్

భారీ వర్షానికి తోడు బుడమేరకు పడిన గండ్లు విజయవాడను ముంచేత్తాయి. కనీవినీ ఎరుగని స్థాయిలో వరద పోటెత్తడంతో విజయవాడ గత ఆరు రోజులుగా వరదలో నానుతోంది. బుడమేరుకు పడిన గండ్లు పూడ్చితేనే విజయవాడకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close