నాగశౌర్య కెరీర్లో ఓ సూపర్ హిట్టు `ఛలో` రూపంలో వచ్చింది. ఈ సినిమాతోనే రష్మిక మడన్నా… కథానాయికగా పరిచయమైంది. తొలి సినిమాతోనే ఆకట్టుకున్న రష్మిక ఇప్పుడు టాలీవుడ్లోనే బిజీ హీరోయిన్ అయిపోయింది. ఇప్పుడు ఈ జంట మరోసారి కనువిందు చేయబోతోందని సమాచారం. సుకుమార్ రైటింగ్స్‌లో సుకుమార్ నిర్మాతగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. సుకుమార్ శిష్యుడు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇందులో శౌర్య, రష్మిక జంటగా నటిస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం ఇతర తారాగణం ఎంపిక జరుగుతోంది. నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల్ని ఎంపిక చేశాక… ఓ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడబోతోంది. ఈ చిత్రానికి సుకుమార్ కేవలం నిర్మాతగా వ్యవహరిస్తాడా? లేదంటే కథ, మాటలు, స్క్రీన్ ప్లే కూడా తనే చూసుకుంటాడా? అనేది తేలాల్సివుంది. ‘నర్తన శాల’ ఫ్లాప్‌తో నౌరాశ్యంలో కూరుకుపోయిన నాగశౌర్యకు మంచి ఛాన్స్ దొరికినట్టే.