నర్తన శాల సినిమా చేసి చాలా పెద్ద తప్పు చేశానని నాగశౌర్య చాలాసార్లుచెప్పాడు. ఇంకెప్పుడూ.. అలాంటి పొరపాటు చేయనని మీడియా ముందు మాటిచ్చాడు. అయితే… మొహమాటం అనే జాడ్యం నాగశౌర్యని ఇంకా వదల్లేదనిపిస్తోంది. నాగశౌర్య ఇప్పుడు కొత్త దర్శకురాలు లక్ష్మీ సౌజన్యతో సినిమా చేస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ కథ ముందు చాలా మంది యువ హీరోల దగ్గరకు వెళ్లొచ్చింది. చివరికి నాగశౌర్య ఓకే చెప్పాడు. కొన్ని రోజులు షూటింగ్ కూడా చేశారు. నిజానికి ఈ కథ కూడా నాగశౌర్య మొహమాటం కొద్దీ ఒప్పుకున్నాడని టాక్. లక్ష్మీ సౌజన్యకు మాట ఇవ్వడం వల్ల – శౌర్య ఈ సినిమా చేయాల్సివస్తోందని సెట్లోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కాకపోతే.. ఓ దర్శకుడికి మాటిస్తే, తన సొంత బ్యానర్లో సినిమా తీసిచ్చేవాడు శౌర్య. సినిమా పోతే.. ఆర్థికంగానూ నష్టాలొచ్చేవి. కానీ ఈసారి మాత్రం బయటి బ్యానర్లో సినిమా తీస్తున్నాడు. ఈసారి ఏం జరగుతుందో చూడాలి.