ఎవ్రి బాల్ సిక్స్ కొట్టే బాట్స్మెన్ ని చూశావా… మా వాడు కొడతాడు
ప్రతీ బాలూ నోబాల్ ఇచ్చే ఎంపైర్ ని చూశావా… ఆవిడ ఇస్తుంది..
ఇదీ… `వరుడు కావలెను`లో హీరో, హీరోయిన్ల క్యారెక్టరైజేషన్. ఒకరు తూర్పు.. ఇంకొకరు పడమర. మరి వాళ్లిద్దరూ కలికలిశారన్నదే కథ. నాగశౌర్య కథానాయకుడిగా నటించిన చిత్రమిది. రీతూ వర్మ కథానాయిక. లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహించింది. టీజర్ ఈరోజు విడుదలైంది.
ఎంతమంది అబ్బాయిల్నిచూసినా వాళ్లెవరికీ కనెక్ట్ కానీ ఓ అమ్మాయి కథ ఇది. వయసు 30. అందుకే ఇంట్లో పెళ్లికి తొందర పెడుతుంటారు. తనకేమో పనిరాక్షసని గుర్తింపు. అలాంటి వధువుకి ఎలాంటి వరుడు దొరికాడన్నది ఇంట్రస్టింగ్ కాన్సెప్ట్. టీజర్ లో విజువల్స్ కూల్ గా ఉన్నాయి. డైలాగులు ఫన్నీగా సాగాయి. ఓ కూల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ చూస్తామన్న భరోసా టీజర్ ఇచ్చేసింది. నాగశౌర్య – రీతూల జంట అందంగా కనిపిస్తోంది. వెన్నెల కిషోర్ పంచ్‌లు వాటికి తోడైతే… ఈసినిమా సూపర్ హిట్ అవ్వడం ఖాయం. ఇప్పటికే… ఈ సినిమాలోని ఓ ఫోక్ సాంగ్ బయటకు వచ్చి – హల్ చల్ చేస్తోంది. అక్టోబరులో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.