నాగశౌర్య ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు. తన చేతిలో ప్రస్తుతం అరడజను సినిమాలున్నాయి. ఒకొక్కటిటీ పట్టాలెక్కుతున్నాయి. టైటిల్స్ ఎంపిక విషయంలోనూ శౌర్య చాలా జాగ్రత్తగానే అడుగులు వేస్తున్నాడు. `వరుడు కావలెను`, `లక్ష్య` లాంటి క్యాచీ టైటిల్స్ పెట్టుకున్నాడు. ఇటీవల.. అనీష్ కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. ఇటీవలే అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ఫిబ్రవరి, లేదా మార్చిలో ఈ సినిమా షూటింగ్ మొదలవుతుంది. ఈ చిత్రానికి ఓ మంచి టైటిల్ అనుకుంటున్నార్ట.
అదే… `శ్రీకృష్ణ – సత్యభామ`. అలాగని ఇది పౌరాణికం కాదు. సోషల్ సినిమానే. అయితే.. హీరో, హీరోయిన్ పాత్రలు మాత్రం శ్రీకృష్ణ – సత్యభామలను పోలి ఉంటుందని తెలుస్తోంది. అందుకే ఆ పేరు ఫిక్స్ చేశార్ట. త్వరలోనే ఈ సినిమా టైటిల్‌కి సంబంధించిన అధికారిక ప్రకటన రాబోతోంది.