‘ఛలో’తో ఓ సూపర్ హిట్‌ని తన ఖాతాలో వేసుకున్నాడు నాగశౌర్య. 2018లో ఇప్పటి వరకూ చూసిన పెద్ద హిట్లలో ‘ఛలో’ ఒకటి. ఈ సినిమాని ప్రమోట్ చేసిన విధానం, జనాల్లోకి తీసుకెళ్లిన పద్ధతి.. ఇవన్నీ బాగా కుదిరాయి. తన సొంత బ్యానర్లో సినిమా చేయడం శౌర్యకి బాగా కలిసొచ్చింది. ఇప్పుడు మళ్లీ తన సొంత బ్యానర్లో రెండో సినిమాకి శ్రీకారం చుట్టబోతున్నాడు. వంశీ పైడి పల్లి దగ్గర శిష్యుడిగా పనిచేసిన చక్రవర్తి ఈ చిత్రానికి దర్శకుడు. ఈ చిత్రానికి ‘@ నర్తన శాల’ అనే పేరు ఖరారు చేశారు. మార్చిలో ముహూర్తం జరుపుకుని ఏప్రిల్ నుంచి షూటింగ్ మొదలెడతారు. పేరుని బట్టి ఇది పౌరాణికం అనిపిస్తుంది గానీ, పక్కా కమర్షియల్ సినిమా అని తెలుస్తోంది. ఆద్యంతం నవ్వులమయంలా సాగుతుందని, నాగశౌర్యకి మరో డిఫరెంట్ మూవీ అవుతుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే ఈ సినిమాపై ఓ అధికారిక ప్రకటన వస్తుంది.