నాగశౌర్యకు కాస్త కితకితలు ఎక్కువే. మనోడు తెరపైనే కాదు.. బయట కూడా రొమాన్స్ బాగానే వర్కవుట్ చేస్తున్నాడని బోల్డన్ని రూమర్లున్నాయి. ఊహలు గుసగుసలాడే టైమ్‌లో రాశీఖన్నాతో బాగా క్లోజ్‌గా మూవ్ అయ్యాడని టాక్. అప్పట్లో ఈ హాట్ వార్తలు భలే చక్కర్లు కొట్టాయి. ఆ తరవాత సోనారికతోనూ అలాంటి ఎఫైర్ ఉందని పుకార్లు రేగాయి. ఈసారి మెగా డాటర్ నిహారికతో నాగశౌర్య క్లోజ్‌గా ఉంటున్నాడని, వీళ్లిద్దరి మధ్య సమ్‌థింగ్ సమ్ థింగ్ నడుస్తోందని గుసగుసలు వినిపించాయి. వీటిపై నాగశౌర్య తొలిసారి స్పందించాడు. ”నేను ఏ హీరోయిన్‌తో పనిచేసినా వాళ్లతో ఎఫైర్ అంగట్టేస్తున్నారు. నాకు అనుష్క అంటే ఇష్టం. అనుష్కకీ నాకూ ఎఫైర్ ఉందని రాయొచ్చుగా. నేను సంతోషిద్దును” అంటున్నాడు కామెడీగా.
నిహారిక చాలా ఫ్రెండ్లీ అని.. పెద్ద కుటుంబం నుంచి వచ్చినా ఏమాత్రం గర్వం లేదని.. తాను టాప్ హీరోయిన్ అవ్వడం ఖాయమని జోస్యం చెబుతున్నాడు. నిహారికకూ, తనకూ మధ్య ఉన్నది ఫ్రెండ్ షిప్పేనట. అయితే.. నిహారికతో మళ్లీ మళ్లీ పనిచేయాలన్న కోరిక మాత్రం బలంగా ఉందని నాగశౌర్య చెబుతున్నాడు. తాను స్ర్కీన్‌పై మాత్రమే రొమాన్స్ కురిపిస్తానని, బయట ఆ విషయంలో చాలా పూర్ అని అమాయకంగా చెబుతున్నాడు. నమ్మొచ్చంటారా?