ఏ ఇండస్ట్రీ అయినా హీరోయిన్ గా నెగ్గుకు రావాలంటే కాస్త పట్టు విడుపులు ఉండాలి మరి.. కేవలం ఒక టైప్ పాత్రలే చేస్తా అంటే క్రేజ్ మీద మొదట రెండు మూడు సినిమాలొచ్చినా తర్వాత అవీ సన్నగిల్లుతాయి. ఇంతకీ ఎందుకు ఈ క్లాసంతా అని అనుకుంటున్నారు కదా.. అదేనండి రోజుకో కొత్త అమ్మాయి హీరోయిన్ గా పరిచయమవుతున్న ఈ సందర్భంలో ఏదో ఒక స్పెషల్ క్వాలిటీ ఉంటే కాని పోటీలో నెగ్గుకు రాలేము. ఇదే విషయాన్ని మొదట సినిమాకే కనిపెట్టేసింది ముద్దుగుమ్మ పాలక్ లల్వాని.
అబ్బాయితో అమ్మాయి సినిమాతో నాగ శౌర్యకు జోడీగా నటించిన ఈ అమ్మడు ఓ రేంజ్లో రెచ్చిపోయింది. పోస్టర్స్ తోనే చెమటలు పట్టిస్తున్న ఈ అమ్మడు ఇక సినిమాలో ఎంత రెచ్చిపోనుందో అని ఆడియెన్స్ అంతా వెయిట్ చేస్తున్నారు. మొదటి సినిమానే అయినా ముద్దులతో ముంచెత్తిందట పాలక్ లల్వాని. క్యూట్ గా ఉంటూనే హాట్ గా కనిపిస్తున్న ఈ అమ్మడు రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో అందరికి షాక్ ఇచ్చేలా మాట్లాడింది.
మొదటి సినిమాలోనే ఇంటిమేట్ సీన్లు చేశారు ఇబ్బంది పడలేదా అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా అన్నిటికి సిద్ధపడే పరిశ్రమలో అడుగుపెట్టా అని గడుసుగానే సమాధానం చెప్పింది. చూస్తుంటే అమ్మడు టాలీవుడ్లో స్టార్ ఇమేజ్ ని సంపాధించేలానే ఉంది. మరి అమ్మడు హాట్ ఎఫెక్ట్ సినిమాకు ఎంతవరకు ఉపయోగపడ్డదో సినిమా రిజల్ట్ చూస్తేనే గాని తెలియదు.