తన మాట నెగ్గలేదని… జబర్దస్త్ షో నుంచి బయటకు వచ్చేసిన నాగబాబు… మల్లెమాల, ఈటీవీలపై సీరియస్ గా విరుచుకుపడుతున్నారు. తన యూ ట్యూబ్ చానల్.. “నా ఇష్టం”లో వరుసగా వీడియోలు పెడుతున్నారు. మొత్తం జబర్దస్త్ గురించే. ఆ షోకి.. తాను ఎంతో చేశానని.. స్వయం సర్టిఫికెట్లు జారీ చేసుకోవడంతో పాటు… ఆ షో అంత సక్సెస్ కావడానికి.. కారణమైన ఆర్టిస్టులను… ఈటీవీ, మల్లెమాల పట్టించుకోవడం లేదని.. బలంగా చెప్పడానికి.. తన వీడియోలను వాడుకుంటున్నారు. షో ప్రారంభమైనప్పటి నుండి… జరిగిన ఇన్సిడెంట్స్ను చెబుతూ.. మల్లెమాల, ఈటీవీలు … అసలు స్పందించలేదని.. ప్రతీ సందర్భంలోనూ చెప్పుకుంటూ వస్తున్నారు. ఇదే చాలా మందిని ఆశ్చర్య పరుస్తోంది.
మల్లెమాల, ఈటీవీ లేకపోతే.. అసలు జబర్దస్తే లేదు. జబర్దస్త్ లేకపోతే.. ఇప్పుడు పదుల సంఖ్యలో వెలుగులోకి వచ్చిన కమెడియన్లకు లైఫే లేదు. ఆ విషయం.. అందరికీ తెలుసు. ఇంత చేసిన మల్లెమాల, ఈటీవీలు అసలు… ఏమీ చేయలేదని.. చెప్పడానికి నాగబాబు ఎందుకు అంత తాపత్రయ పడుతున్నారో.. చాలా మందికి అర్థం కావడం లేదు. నాగబాబు వీడియోల్లో చెప్పే దాని ప్రకారం చూస్తే.. షోలో పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్కరి వ్యక్తిగత వ్యవహారాలను కూడా.. మల్లెమాల శ్యామ్ ప్రసాద్ రెడ్డి, ఈటీవీ రామోజీరావు దగ్గరుండి చూసుకోవాల్సి ఉందని.. వారికే కష్టం వచ్చినా స్పందించాల్సి ఉందని.. కానీ వారేం పట్టించుకోనందున.. తాను పట్టించుకున్నానని.. నాగబాబు చెప్పుకొస్తున్నారు. ఎవరి వ్యక్తిగత కష్టాలు.. ఎవరి వ్యక్తిగత వ్యవహారాలు వాళ్లే భరించాలి కానీ… పని చేసే.. ఉపాధి ఇచ్చే సంస్థ భరించాలని నాగబాబు ఎందుకు అంటున్నారో.. జబర్దస్త్ ఆర్టిస్టులకే అర్థం కాని పరిస్థితి.
నాగబాబు ఎన్నో సార్లు చెప్పారు… తనకు .. రెండో లైఫ్ జబర్దస్త్ ఇచ్చిందని. మల్లెమాలకు.. ఈటీవీకి జీవితాంతం రుణపడి ఉంటానని కూడా చెప్పుకున్నారు. లేకపోతే ఆర్థిక సమస్యలతో ఆత్మహత్య చేసుకునేవాడ్నని కూడా మొహమాటం లేకుండా ప్రకటించుకున్నారు. ఇప్పుడు.. ఫామ్లో ఉన్న కమెడియన్లు.. అందరూ… అదే చెబుతారు. ఓ మల్లెమాల.. మరో ఈటీవీ… వాళ్లకు ఎంత చేసిందో.. ఈ మాటలతోనే తేలిపోతుంది. కానీ బయటకు వచ్చిన తర్వాత.. ఏమీ చేయలేదని.. వాళ్లు స్పందించలేదని… వాళ్ల షో సూపర్ హిట్ చేసుకుని క్యాష్ చేసుకుని.. అందులో పార్టిసిపేట్ చేసిన వారిని గాలికొదిలేశారని.. చెప్పుకోవడం.. హిపోక్రసీ కాక మరేమిటన్న ప్రశ్నలు వస్తున్నాయి. నాగబాబు మాత్రం..వీటిని పట్టించుకోకుండా.. తన స్టైల్లో తాను వీడియోలు పెట్టుకుంటూ పోతున్నారు.