సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మెగా బ్రదర్ నాగబాబు అనూహ్యంగా ట్విట్టర్ ఖాతాను డిలీట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. సడెన్ గా ఆయన ఎందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నది ఆసక్తి రేకెత్తిస్తోంది.
నాగబాబు ట్విట్టర్ అకౌంట్ డిలీట్ చేయడానికి ఇటీవల చేసిన ఓ ట్వీటే కారణమనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఏపీ ఎన్నికల ప్రచారంలో నంద్యాల వైసీపీ అభ్యర్థికి అల్లు అర్జున్ మద్దతు ప్రకటించడంపై తీవ్ర దుమారం రేగుతోన్న సమయంలోనే నాగబాబు ఇటీవల ఓ ట్వీట్ చేశారు.
మాతో ఉంటూ ప్రత్యర్థులకు పని చేసేవాడు మావాడు అయినా పరాయి వాడే… మాతో నిలబడే వాడు పరాయివాడైనా మా వాడే …అంటూ నాగబాబు చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. నాగబాబు ఎవరిని ఉద్దేశించి ఈ ట్వీట్ చేశారన్నది క్లారిటీ లేదు కానీ, అల్లు అర్జున్ ను ఉద్దేశించే ఆయన ట్వీట్ చేశారని టాక్ వినిపించింది.
నాగబాబు చేసిన ట్వీట్ అల్లు – మెగా ఫ్యామిలీలో మనస్పర్ధలకు కారణమైందా..? మరేమిటో కాని సడెన్ గా ఆయన ట్విట్టర్ అకౌంట్ ను క్లోజ్ చేయడం పలు సందేహాలకు కారణం అవుతోంది. ఫ్యామిలీలో తలెత్తిన విబేధాలే నాగబాబు ట్విట్టర్ ఖాతా డిలీట్ చేసేందుకు దారితీసిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.