పవన్ కల్యాణ్ ను రాజకీయంగా ఎదుర్కోవడానికి ఆయన తల్లిని కూడా రాజకీయాల్లోకి తెచ్చి దారుణమైన ఆరోపణలు చేస్తున్న వైసీపీ నేతలకు మెగా బ్రదర్ నాగబాబు గట్టి కౌంటర్ ఇచ్చారు. చిరంజీవి, పవన్ , నాగబాబులు కాపు కులానికి చెందిన వారని కాదని చెప్పేందుకు చక్రవర్తి అనే వైసీపీ నేత.. వైసీపీ కూలీ మీడియాకు ఓ ఇంటర్యూ ఇచ్చి వారి తల్లిది రెల్లి కులమని ఆరోపించారు. ఆ వీడియోను వైసీపీ సోషల్ మీడియా ఇష్టం వచ్చినట్లుగావైరల్ చేసింది. ఇక వైసీపీ నేతల కామెంట్ల గురించి చెప్పాల్సిన పని లేదు.
దీనిపైనాగబాబు స్బందించారు. గత ఎన్నికల సమయంలో రెల్లి కులాన్ని తాను దత్తత తీసుకుంటానని పవన్ చెప్పారని… ఎందుకంటే ఆ కులాన్ని మన సమాజం చాలా తక్కువ చేసి చూసిందని నాగబాబు అన్నారు. కాపు కులంలో పుట్టినందుకు తాను గర్వపడతానని, గర్వపడాలి కూడా అని చెప్పారు. ఏ వ్యక్తి అయినా వారి కులంలో పుట్టినందుకు గర్వపడతాడని అన్నారు. నిజంగా తమ తల్లి రెల్లి కులంలో పుట్టి ఉంటే తామంతా ఎంతో గర్వంగా ఫీల్ అయ్యేవారమని నాగబాబు చెప్పారు.
రెల్లి కులస్తులను సఫాయి కార్మికులు అంటారని… సమాజంలోని కుళ్లుని, చెత్తని, నీచాన్ని శుభ్రం చేసి, మనకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించేది రెల్లి కులస్తులేనని తెలిపారు. అలాంటి వాళ్లకు మనం చేతులెత్తి దండం పెట్టాలని అన్నారు. వైసీపీ వాళ్లకు రెల్లి కులస్తులంటే లోకువయిపోయారని మండిపడ్డారు. ‘అరేయ్ పిచ్చోళ్లారా.. మా అమ్మ రెల్లి కులంలో పుట్టి ఉంటే బాధ పడంరా… సంతోషపడతాం రా’ అని అన్నారు.
స్వార్థ రాజకీయాల కోసం ఎంతకైనా దిగజారిపోతున్నారని పెళ్లాలు, పెళ్లిళ్లు, తల్లులు, పిల్లల గురించి మాట్లాడుతున్నారని నాగబాబు మండిపడ్డారు. మొత్తంగా వైసీపీ నేతలు.. భార్యల్ని..తల్లుల్ని రాజకీయాల్లోకి తీసుకు వచ్చి ఏం చేయాలనుకుంటున్నారో కానీ.. రేపు అది రివర్స్ అవుతుందే సంగతిని గుర్తు పెట్టుకోవాలని జనసైనికులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.