ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ లో కలిపేయడం పవన్ కళ్యాణ్ కు ఏ మాత్రం ఇష్టం లేదు. అయితే అన్నయ్య చిరంజీవి మాత్రం అప్పటి పరిస్థితిల ప్రకారం పార్టీ విలీనానికే మొగ్గు చూపి ప్రజారాజ్యం జెండా పీకేశారు. ఈ ఎపిసోడ్ లో కళ్యాణ్ ఈగో చాలా హార్ట్ అయ్యిందనే మాట నిర్విదాంశం. ఈ వీలినమే చిరుకు పవన్ కు మధ్య గ్యాప్ తెచ్చిందని చెబుతుంటారు. అయితే ఇది గతం. ఇప్పుడు ప్రెజెంట్ లోకి వస్తే.. పవన్ ‘జనసేన’ పెట్టుకున్నారు. చిరంజీవి కాంగ్రెస్ లో వున్నారు. అయితే వున్నా లేనట్లే. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో పూర్తిగా నిర్జీవమైపోయిన కాంగ్రెస్ లో చిరు కూడా ఇన్ యాక్టివ్ అయిపోయి ప్రస్తుతం సినిమాలపై ఫోకస్ పెట్టారు. చిరంజీవి 2019ఎన్నికల బరిలో వుంటారా ? అంటే సందేహం. కాని పవన్ కళ్యాణ్ మాత్రం ఎలక్షన్ పాలిటిక్స్ సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. గత ఎన్నికల్లో మద్దత్తు తో సరిపెట్టుకున్న కళ్యాణ్ … ఈసారి అమీతుమికి సిద్ధం అవుతున్నారు. దీనికి సంబధించిన బ్యాక్ గ్రౌండ్ వర్క్ జరుగుతోంది.
ఈలాంటి నేపధ్యంలో మెగా బ్రదర్ నాగబాబు తన మనసులో మాట చెప్పారు. ‘జనసేన’తో కలసి పనిచేయాలని వుంది”అని అంటున్నారు నాగబాబు. ”నాకు కళ్యాణ్ బాబు చాలా చేశాడు. నేనే ఏం చేయలేకపోయాను. నా తమ్ముడు గొప్ప మనిషి. వాడు నాకు చాలా చేశాడు. కుదిరితే వాడితో కలసి పనిచేయాలని వుంది. రానున్న ఎన్నికల్లో పోటి చేస్తున్నాడు. వాడికి పార్టీ తరపున ఏదైనా పని చేసిపెట్టలాని వుంది. కోరితే తప్పకుండా వాడికోసం ఏమీ ఆశించకుండా పనిచేస్తా”అని తన మనసులో మాట చెప్పకొచ్చారు నాగబాబు.
అన్నట్టు ఇంకో విషయం.. చిరంజీవి కాంగ్రెస్ తరపున ఇక ఎన్నికల్లో దిగడం ఇక జరగకపోవచ్చట. అందుకే కళ్యాణ్ బాబుకే మీ సపోర్ట్ వుండాలని మెగా ఫ్యాన్స్ కు తన మాటగా చెప్పేశారట నాగబాబు. మొత్తంమ్మీద తమ్ముడు కళ్యాణ్ తో కలసి పనిచేయాలని ఆరాటపడుతున్నారు నాగబాబు. మరి, దీనిపై కళ్యాణ్ మనసులో మాట ఏమిటో..