రామ్ చరణ్ ఆరెంజ్ సినిమాని మళ్ళీ విడుదల చేసిన సంగతి తెలిసిందే. రిరిలీజ్ ట్రెండ్ లో చాలా మంచి రెస్పాన్స్ వచ్చిన సినిమాల్లో ఆరెంజ్ కూడా వుంది. ఇప్పుడీ సినిమా ఎంత కలెక్ట్ చేసిందో చెప్పారు నిర్మాత నాగబాబు. కోటి ఐదు లక్షల రూపాయిలు రాబట్టింది. ఈ మొత్తం డబ్బుని పవన్ కళ్యాణ్ జనసేనకి పార్టీ ఫండ్ గా ఇచ్చారు నాగబాబు.
అప్పట్లో మగధీర తర్వాత రామ్ చరణ్ చేసిన ఆరెంజ్ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడాయి. విడుదలకు ముందే పాటలు సూపర్ హిట్ అయ్యాయి. చాలా అంచనాలతో వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. లవ్ కాన్సెప్ట్ చాలా మందికి కనెక్ట్ కాలేదు. నిర్మాతగా ఈ సినిమా నాగబాబుకి చాలా నష్టాలని మిగిలిచింది. అప్పట్లో పవన్ కళ్యాణ్, నాగబాబుని ఆదుకున్నారు. ఇప్పుడు రిరిలీజ్ తో వచ్చిన డబ్బుని పవన్ పార్టీకి ఇచ్చి కొంత ఋణం తీర్చుకున్నారు నాగబాబు.