పవన్ కల్యాణ్ Vs శ్రీరెడ్డి వివాదంలో నాగబాబు గళం విప్పారు. సినీ రంగంలోని వివిధ సమస్యల గురించి కూలంకుశంగా ప్రస్తావిస్తూ… తన తమ్ముడి జోలికి వస్తే తాట తీస్తా అంటూ హెచ్చరించారు. ఈరోజు ఫిల్మ్ ఛాంబర్లో జరిగిన ప్రెస్ మీట్లో నాగబాబు సుదీర్ఘంగా ప్రస్తావించిన విషయాల్లో హైలెట్స్ ఇవీ…
- * మా అసోసియేషన్ అవకాశాలు ఇవ్వడానికి ఏర్పడలేదు. `మా` సభ్యుల సమస్యలు తీర్చడానికి మాత్రమే `మా` ఉంది.
- * మా ఎవ్వరికీ ఫ్రీ మెంబర్ షిప్ ఉండదు. అవగాహన లేకుండా ఎవ్వరూ విమర్శించొద్దు
- * శివాజీ నోరు జారి చిన్న తప్పు మాట్లాడాడు. ఆ మాత్రం దానికి శివాజీని తప్పుపట్టకండి. అవగాహన లేని వాళ్లకు మా గురించి మాట్లాడే హక్కు లేదు. ఒక వేళ ఏమైనా సమస్య ఉంటే.. కోర్టుకి వెళ్లి పరిష్కరించుకోండి
- * కాస్టింగ్ కౌచ్ అన్న మాట ఉందన్న విషయం ఇప్పుడే తెలిసిందా? ఇదో దరిద్రమైన విషయం అని మా అందరికీ తెలుసు.
- * కాస్టింగ్ కౌచ్, దళారీ వ్యవస్థ, ఆడవాళ్ల వసతులు.. ఈ మూడింటిపై మాట్లాడడానికి వచ్చా.
- * ఈ చిత్రసీమ ఓ మినీ ప్రపంచం. ఈ ప్రపంచంలో ఏం జరుగుతుందో సినిమా ప్రపంచంలోనూ అదే జరుగుతోంది. ఇక్కడ దేవుళ్లూ దేవతలు ఉండరు. మనుషులే ఉంటారు.
- * ఓ అమ్మాయిని వంకరగా చూసినా.. అరెస్టు చేయించే హక్కు ఆడవాళ్లకు ఉంది. ఎవరైనా అసభ్యకంగా ప్రవర్తిస్తే.. పోలీస్ స్టేషన్‌కి వెళ్లాలి. వెళ్లకపోతే.. అది మీ అవగాహన రాహిత్యం. ఎవరైనా తప్పు చేస్తే మేం ఉరిశిక్ష వేసేస్తామా? చట్టాన్ని చేతిలోకి తీసుకుంటామా? పోలీస్ స్టేషన్‌కి వెళ్లాల్సిందే
- * ఆడవాళ్లపై వేధింపులకు నేను వ్యతిరేకిని.. నేనెప్పుడూ పొరపాటుగా ఏం చేయలేదు. నా దృష్టికి వస్తే.,. దవడ పగలకొట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. పెద్ద సినిమాల్లో కాస్టింగ్ కౌచ్ చాలా తక్కువగా ఉంటుంది. ఎవడో ఓ వెధవ ఉంటాడు.. అంతే.
- * ఎవరైనా మిమ్మల్ని అసభ్యంగా ప్రవర్తిస్తే చెప్పుతీసుకుని కొట్టండి. అది మీ హక్కు.
- * ఇండ్రస్ట్రీలో 10 శాతం ఎదవలు ఉంటే.. మిగిలిన తొంభైమంది మంచోళ్లే. మేం ఆడవాళ్లని గౌరవిస్తాం.
- * ఇండ్రస్ట్రీలో ఎంత గౌరవం లేకపోతే నా కూతుర్ని ఈ పరిశ్రమకు తీసుకొస్తాను? స్త్రీని సెక్స్ బొమ్మగా చూడం..
- * దళారి వ్యవస్థలో ఏం జరుగుతుందో చూసుకోవడం దర్శక నిర్మాతలకు సాధ్యం కాదు. ఎవరైనా లైంగికంగా వేధిస్తుంటే… ప్రొడక్షన్ కంపెనీకి రిపోర్ట్ చేయండి. అదేం తప్పు కాదు. మెంబర్ షిప్కీ దానికీ ఎలాంటి సంబంధం లేదు,.
- * లొకేషన్లో సరైన టాయ్‌లెట్ సౌకర్యం లేదు. కె.ఎల్ నారాయణ, కిరణ్‌లతో మాట్లాడతా. వాళ్లతో చర్చించడానికి సిద్ధంగాఉన్నా. షూటింగ్ లొకేషన్లో సరైన సౌకర్యాలు కల్పించడానికి నేను కృషి చేస్తా.
- * కాస్టింగ్ కౌచ్ సినిమా పరిశ్రమలోనే కాదు టీవీ పరిశ్రమలోనూ ఉంది.
- * క్యాష్ కమిటీలు ఎన్నొచ్చినా.. ఆడవాళ్లలో ధైర్యం లేకపోతే… ఎవ్వరూ ఏం చేయలేరు.
- * తెలుగు వాళ్లకే పాత్రలు ఇవ్వాలి అంటున్నారు. ఇక్కడున్నవాళ్లంతా తెలుగువాళ్లే కదా? అమెరికా నుంచి వచ్చారా ఏంటి? తెలుగువాళ్లకు అవకాశాలు ఇవ్వమని `మా` అభ్యర్థిస్తుంది తప్ప, అవకాశాలు ఇవ్వలేదు. కోట్లు పెట్టి సినిమాలు తీసేవాళ్లకు కోటి రూపాయలు నష్టం వస్తే `మా` ఇస్తుందా? ఎవరూ ఇవ్వరు. నిర్మాతలు జీవితాల్ని పణంగా పెట్టి సినిమాలు తీస్తున్నారు. తెలుగు వాళ్లకే అవకాశాలు ఇవ్వమని మెడలు వంచలేం.
- * ఎవరు ఎక్కడైనా నటించే హక్కు ఉంది. ఇక్కడికి ఎవరూ రాకూడదు అని చెప్పే హక్కు లేదు.
- * ప్రతివాళ్లు చిత్రసీమని చులకన చేసి మాట్లాడడమే. సినిమాలు చూసి జనాలు చెడిపోతున్నారా? సినిమాల్లో ఉన్న చెడుని చూసి జనాలు చెడిపోతుంటే, సినిమాల్లో చూపించే మంచి పట్టదా? బయట నిలబడి చిత్రసీమపై రాళ్లు వేయడం కాదు. ఇక్కడికి వచ్చి పనిచేయండి. ఇక్కడా గొప్ప సినిమాలు తీశారు, తీస్తున్నారు. ఎవరో పది శాతం తీసే చెత్త సినిమాలకు మేమెలా బాధ్యులం అవుతాం. మేం కమర్షియల్ సినిమాలే తీయాలా? రామాయణ మహాభారతాలే ఎంచుకోవాలా?
- * హింస, సెక్స్ తగ్గించడానికి సెన్సార్ ఉంది.
- * గౌరవ ప్రదంగా చిత్రసీమలో అడుగుపెట్టి ఎదిగిన కథానాయకులు ఉన్నారు.
- * యూట్యూబ్‌లో ఆడవాళ్ల బాధల్ని చూసి చలించా. అందుకే మాట్లాడడానికి వచ్చా. వాళ్ల కోసం పోరాడ్డానికి సిద్ధమయ్యా.
- * ప్రతీ విషయానికీ కల్యాణ్ బాబు రావాల్సిన అవసరం లేదు. ఓ మంచి పని మీద ప్రజల్లోకి వెళ్లాడు. ఈ చిన్న సమస్యని డీల్ చేయడానికి నేను చాలు.
- * కల్యాణ్ బాబు ఏం తప్పు మాట్లాడాడు? పోలీస్ స్టేషన్‌కి వెళ్లమనడం తప్పా?? అలా చెప్పడంలో మీ విజ్ఞత ఏమిటో నాకు అర్థం కావడం లేదు. పోలీసు వ్యవస్థ, న్యాయ వ్యవస్థ గొడ్డు పోలేదు. న్యాయం ఇంకా ఉంది.
- * మంచిని మంచిగా చూపించండి.. చెడుని చెడుగా చూపించండి. టీఆర్పీల కోసం పాకులాడకండి. మీరు కూడా పాడైపోతే.. జనాల్ని బాగు చేయలేరు.
- * కల్యాణ్ బాబుని నీచంగా తిట్టింది. అది చూసి బాధేసింది. స్పందించాలనుకున్నాం. కానీ.. చాలామంది స్పందించారు. మమ్మల్ని ఎంత నీచంగా మాట్లాడినా భరిస్తాం. బలవంతులకే భరించే శక్తి ఉందని పవన్ చెప్పేవాడు. అదే మేం నమ్ముతున్నాం
- * తుపాన్లొచ్చినా, యుద్దాలొచ్చినా, కష్టాలొచ్చినా, కన్నీళ్లొచ్చినా సినిమా వాళ్లు ఆదుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి.
- * మెగా ఫ్యామిలీని ఏ రాయి ఇచ్చుకుని కొట్టినా మూసుకుని కూర్చుంటాం అని అనుకోకండి. మేం ఎలా రియాక్ట్ అవుతామో మాకు తెలీదు. బయట ఫ్యాన్స్ ట్రోలింగ్ చేస్తే మాదా బాధ్యత. మేం చెప్పాల్సింది ఏనాడో చెప్పాం.
- * తప్పు చేస్తే బహిరంగంగా ఒప్పుకునే దమ్మున్న మొనగాడు నా తమ్ముడు. మీకుందా ఆ దమ్ము?? డబ్బులు వదులుకుని ప్రజలకు సేవ చేద్దామని రాజకీయాల్లోకి వెళ్లాడు. వాడిని అంటారా మీరు??
- * పవన్ నిశ్శబ్దం చేతకాని తనం కాదు.
-
* ఈ ఇష్యూ గురించి మా అమ్మతో మాట్లాడాను. అమ్మా నిన్ను ఇలా తిట్టారమ్మా అని అన్నాను. అమ్మ నవ్వేసింది. మా అమ్మకి చెప్పే నేను ఇక్కడికి వచ్చా.