జనసేన పార్టీ తరపున నాగబాబు యాక్టివ్ అవుతున్నారు. ఆయన ఉత్తరాంద్ర బాధ్యతలు తీసుకోవడానికి ఆసక్తిగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం జనసేన పార్టీ కార్యకలాపాలు అంత చురుకుగా సాగడం లేదు. పవన్ షూటింగ్లలో బిజీగా ఉంటున్నారు. నాదెండ్ల మనోహర్ ఒక్కడే చూసుకోవాలి. మూడు ప్రాంతాలకు విడివిడిగా ఇంచార్జ్‌లు కూడా లేరు. ఈ కారణంగా పార్టీ వ్యవహారాలు స్లో అయ్యాయి. నియోజకవర్గాల్లో జనసైనికులు కాస్తంత పోరాడుతున్నా.. లెక్కలోకి రావడంలేదు. దీంతో ఇప్పుడు అంతోఇంతో చాయిస్ ఉన్న ఉత్తరాంధ్ర బాధ్యతను తాను తీసుకోవాలని నాగబాబు డిసైడయినట్లుగా తెలుస్తోంది.
దీనికి పవన్ కల్యాణ్ కూడా అంగీకరించడంతో ఆయన… ఉత్తరాంధ్ర పర్యటనకు సిద్ధమయ్యారు. ఒకటో తేదీ నుండి మూడు రోజుల పాటు మూడు ఉత్తరాంధ్ర ఉమ్మడి జిల్లాల్లో పర్యటించి పార్టీ పరిస్థితిపై ఓ అంచనాకు వస్తారు. కార్యచరణ ఖరారు చేసే అవకాశం ఉంది. నాగబాబు పర్యటన నుంచి జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించింది. అయితే నాగబాబును పార్టీ క్యాడర్ ఎంత సీరియస్‌గా పట్టించుకుంటారన్నది ఇప్పుడు కీలకం. ఎందుకంటే ఇప్పుడు ఆయనకు పార్టీలో ఏ పదవీ లేదు.
పార్టీ కోసం ప్రత్యేకంగా పని చేసిందీ లేదు. ఇప్పుడు హఠాత్తుగా ఎన్నికల వేడి పెరుగుతున్న సమయంలో ఆయన తెర ముందుకు వస్తున్నారు. పైగా ఇటీవల అభిమానుల సమావేశాలు ఆయన కనుసన్నల్లోనే జరుగుతున్నాయని…పొత్తుల విషయంలో పవన్ ఆలోచలను ప్రభావితం చేసేలా చేస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. దీంతో ఉత్తారంధ్రలో నాగబాబు పర్యటన హాట్ టాపిక్‌గా మారుతోంది.