జబర్దస్త్ నుంచి బయటకు వచ్చేసి.. జీ తెలుగుతో అసోసియేట్ అయన మెగా బ్రదర్ నాగేంద్రబాబు “అదిరింది” అనే ప్రోగ్రామ్‌ను డిజైన్ చేశారు. కానీ అది మొదట్లోనే డిజాస్టర్ టాక్ తెచ్చేసింది. నాగేంద్రబాబు.. గతంలో నిర్మాతగా తీసిన సినిమాలలాగే.. “అదిరింది” కూడా.. పబ్లిసిటీ పీక్స్.. విషయం వీక్స్ అన్నట్లుగా మారిపోయింది. జబర్దస్త్ రేటింగ్.. 5-6 మధ్యలో ఉంటే..అందులో సగం కాదు కదా.. ఆ సగంలో సగం కూడా.. తెచ్చిపెట్టలేకపోయారు నాగేంద్రబాబు. జీ తెలుగులో ఆదివారం వస్తున్న అదిరింది వస్తున్న రేటింగ్ 0.5 కి అటూఇటూగా ఉంటోంది. హాలీడే రోజు.. అదీ ప్రైమ్‌టైమ్‌లో ఇంత దారుణమైన రేటింగ్ వచ్చిందంటే.. ఆ ప్రోగ్రామ్‌ను.. మరో “ఆరెంజ్” కేటగిరిలో వేసేయవచ్చనేది.. టీవీ ఎక్స్పర్ట్స్ విశ్లేషణ.
జబర్దస్త్‌కు పోటీగా కాకపోయినా.. నాగబాబు.. ఆ షో నుంచి బయటకు వచ్చి.. మల్లెమాలపై.. లేని పోని ఆరోపణలు చేసి… తాను చేయబోయే కొత్త షోకి.. కాస్త పబ్లిసిటీ తెచ్చుకునే ప్రయత్నం చేశారు. జబర్దస్త్ నుంచి.. స్టార్ కమెడియన్లను.. యాంకర్లను తీసుకెళ్తున్నట్లుగా ప్రచారం చేశారు. ఓ రకంగా.. జబర్దస్త్ మొత్తం.. అక్కడ్నుంచి నాగబాబుతో పాటు వెళ్తుందన్నట్లుగా చెప్పారు. తొలిగా.. కొంత మందితో స్కిట్స్ చేశారు కూడా. కానీ.. ఎవరూ.. జబర్దస్త్ ను వదిలి పెట్టలేదు. అక్కడ చేస్తూనే నాగబాబు మాట కాదనలేక.. అదిరిందిలోనూ చేయడం ప్రారంభించారు. దీంతో కొత్త దనం అనేది లేకపోగా.. జబర్దస్త్ పాత ఎపిసోడ్ల మాదిరి తయారయింది. అలా అనిపించే..ఈ టీవీ .. అదిరింది షో వస్తున్న.. జబర్దస్త్ పాత ఎపిసోడ్లను.. టెలికాస్ట్ చేసి.. అంత కంటే ఎక్కువ రేటింగ్‌లు పొందుతోంది.
నాగబాబు… తన వల్లే.. జబర్దస్త్ గొప్ప విజయం సాధించిందన్న భావనలో ఉన్నారు. అందుకే.. తాను లేకపోతే జబర్దస్త్.. కొలాప్స్ అయిపోతుందని అనుకున్నారు. కానీ ఆయన గురించి ఆయన ఎక్కువ ఊహించుకున్నారని.. అదిరింది ప్రోగ్రామ్ కి వస్తున్న రేటింగ్‌లతో తేలిపోతోంది. అయితే.. జీ యాజమాన్యాన్ని నాగబాబు… ఎలా ఒప్పించారో కానీ… జబర్దస్త్ వచ్చే గురు, శుక్రవారాల్లో కూడా..అదిరింది ప్రోగ్రామ్ షెడ్యూల్ చేయిస్తున్నట్లుగా ప్రకటించారు. అలా కూడా.. ఉన్న ఇమేజ్ పలుచన చేసుకుంటే.. నాగబాబును ఇక టీవీ ఇండస్ట్రీలో కూడా పట్టించుకునేవారు ఉండకుండా పోతారు.