నటి, నిర్మాత, దర్శకురాలు జీవితపై నగరి కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఓకే ఆస్తిని ఇద్దరికి విక్రయించారన్న కేసులో జీవితపై ఈ వారెంట్ జారీ అయ్యింది. జీవితకు చెందిన ఓ ఇంటిని జ్యోస్టర్ కంపెనికి ఎండీ హేమకు రూ.26 కోట్లకు అమ్మేశారని, అయితే ఆ ఆస్తిని ఇది వరకే మరొకరికి విక్రయించారన్నది ఆరోపణ. ఈ విషయమై జీవితని అడిగితే.. ఆమె కొన్ని చెక్కులు హేమకు అందించార్ట. అవన్నీ బౌన్స్ అయ్యాయని సమాచారం. అందుకే హేమ కోర్టుకెళ్లారు. ఈ కేసులోనే జీవితపై నాన్ బెయిలబ్ వారెంట్ జారీ చేశారు. అయితే.. ఈ నేపథ్యంలో జీవిత శనివారం హైదరాబాద్ లో ఓ కీలకమైన ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు. తనపై వస్తున్న ఆరోపణలపై ప్రెస్ మీట్ లో సమాధానం చెబుతానని, తన దగ్గర అన్ని ఆధారాలూ ఉన్నాయని జీవిత అంటున్నారు. మరి ఆ ఆధారాలేమిటన్నది తెలియాలంటే రేపటి వరకూ ఆగాలి.