కింగ్ నాగార్జున రెండో కుమారుడు అఖిల్ ఇప్పటివరకూ తెలుగులో రెండు సినిమాలు చేశాడు. అతను హీరోగా ఇంట్రడ్యూస్ అయిన ‘అఖిల్’ డిజాస్టర్ కాగా, రెండో సినిమా ‘హలో’ ఏదో సోసోగా ఆడింది. తాజాగా ‘తొలిప్రేమ’తో దర్శకుడిగా మారి, తొలి అడుగులో హిట్ కొట్టిన వెంకీ అట్లూరి దర్శకత్వంలో హీరోగా తన మూడో సినిమా చేస్తున్నాడు అఖిల్. దీని తర్వాత హిందీలో సినిమా చేస్తాడని వార్తలు వస్తున్నాయి. ఇదే విషయాన్ని నాగార్జునను అడిగితే వేదాంత ధోరణిలో సమాధానం చెప్పారు. “నాన్నగారు (ఏయన్నార్) నటించిన ‘మురళీకృష్ణ’ సినిమాలో ఒక పాట వుంది. ‘నీ సుఖమే నే కోరుకున్నా…’ అని. అందులో ‘అనుకున్నామని అన్నీ జరగవు..’ అని వస్తుంది. అలాగే, మనం ఎన్నో అనుకుంటాం. అన్నీ జరగాలి కదా” అని నాగ్ తెలిపారు. అవునని గానీ, కాదని గానీ చెప్పకుండా తెలివిగా సమాధానం దాటవేశారు. అదండీ సంగతి. ప్రస్తుతం