నాగార్జున హీరోగా వర్మ దర్శకత్వంలో రూపొందిన ‘ఆఫీసర్’ ఎల్లుండి ప్రేక్షకుల ముందుకొస్తోంది. దీని తర్వాత అఖిల్ హీరోగా సినిమా చేయబోతున్నట్లు రామ్‌గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. అయితే… నాగార్జున గానీ, ఆయన తనయుడు అఖిల్ గానీ వర్మతో సినిమా చేస్తున్నట్టు ప్రకటించలేదు. చిన్న ట్వీట్ కూడా వేయలేదు. అప్పుడే సినిమాపై అనుమానాలు మొదలయ్యాయి. వర్మ చేసే అనౌన్స్మొంట్స్లో ఇదీ ఒకటి అవుతుందని అందరూ అనుకున్నారు. నాగార్జున మాటలు వాటిని నిజం చేశాయి. ‘అఖిల్‌తో సినిమా చేయబోతున్నట్టు వర్మ ట్వీట్ చేశారు కదా’ అని నాగార్జునను ప్రశ్నించగా…. ‘‘వాళ్ళిద్దరూ (అఖిల్, రామ్‌గోపాల్ వర్మ) మాట్లాడుకుంటున్నారు. ఏం జరుగుతుందో చూద్దాం. ముందు మాట్లాడుకోనివ్వండి! నేను అయితే ఆ సినిమా వుంటుందని ట్వీట్ చేయలేదుగా!’’ అన్నారు. సో… అఖిల్‌తో వర్మ సినిమా లేనట్టే. ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో నటించబోయే సినిమా కోసం అఖిల్ రెడీ అవుతున్నాడు.