నాని అంటే నాగ్‌కి ప్రత్యేకమైన అభిమానం. ఎంతగా అంటే.. ‘మల్టీస్టారర్ చేయాల్సివస్తే.. నానితోనే చేస్తా’ అని చెప్పేంతగా. అది ‘దేవదాస్’ సాకారమైంది. తనో స్టార్ హీరో అని, సీనియర్ అనీ భేషజాలకు పోకుండా.. నానితో తన వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్‌ని ఎప్పటికప్పుడు పంచుకుంటూనే వస్తున్నాడు నాగ్. ప్రతీసారీ నానిని పొగడ్తలతో ముంచెత్తుతూ వస్తున్నాడు. ‘దేవదాస్’ తాజా ప్రెస్ మీట్లో కూడా నానిని తెగ పొగిడేశాడు నాగ్. నానితో పనిచేయడం వల్ల.. తనకంటూ క్వాలిటీ టైమ్దొరికిందని సంతోషంగా చెప్పాడు. అంతేకాదు.. ”నాని ని చూస్తుంటే తొలి రోజుల్లో నాన్నగారు చేసిన సినిమాలు, ఆ పాత్రలు గుర్తొస్తున్నాయి” అంటూ మంచి కాంప్లిమెంట్ ఇచ్చాడు. నాని డిక్షన్ బాగుంటుందని, ఎంత వేగంగా మాట్లాడినా… ఆ డిక్షన్ అలానే ఉంటుందని, ప్రతీ మాటా అర్థమవుతుందని కితాబిచ్చాడు. నాచురల్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న నానికి ఈ ప్రసంశలు నిజంగా కొత్తవి. నాగ్ అంతటివాడు… తన తండ్రి సినిమాలతో, పాత్రలతో నాని నటనని పోల్చడం… గొప్ప విషయమే.
నాని కూడా నాగ్‌తో తన అనుబంధాన్ని గట్టిగానే గుర్తు చేసుకున్నాడు. ఈ సినిమా తనకెన్నో విలువైన జ్ఞాపకాల్ని ఇచ్చిందని, ఇది వరకు నాగ్ ని చూస్తే ‘శివ’ సినిమాగుర్తొస్తే.. ఇక నుంచి తనకు మాత్రం ‘దేవ’ గుర్తుకు వస్తాడని చెప్పుకొచ్చాడు నాగ్. వీరిద్దరి అనుబంధం చూస్తుంటే తప్పకుండా త్వరలోనే వీరిద్దరి కాంబినేషన్లో మరో సినిమారాబోతోందేమో అనిపిస్తోంది. కొసమెరుపు ఏమిటంటే… ‘దేవదాస్ 2’ గురించి నాని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం. నాగ్ ఈ ప్రెస్ మీట్‌కి కాస్తతెల్ల గడ్డంతో వచ్చాడు. ‘ఈ గెటప్ బాగుంది. పార్ట్ 2కి ఇదే కంటిన్యూ చేద్దామా’ అంటూ నాగ్నికవ్వించాడు నాని. సో… `దేవదాస్ 2` ఆశించినా తప్పులేదన్నమాట.