కుటుంబానికి సమయం ఎలా గడపాలో, కుటుంబంతో ఎంత ఎంజాయ్ చేయాలో నాగార్జునకి బాగా తెలుసు. సినిమాలు, వ్యాపారాలతో ఎంత బిజీగా ఉన్నా – ఫ్యామిలీకంటూ కొంత టైమ్ ఉంటుంది. ఓ సినిమా పూర్తయిన వెంటనే ఫ్యామిలీ ట్రిప్ వేయడం నాగ్‌కి అలవాటు. ఇప్పుడు అదే పనిలో ఉన్నారు నాగ్. ఈ యేడాదంతా నాగ్ ఫ్యామిలీ ఫుల్ బిజీగా గడుపుతోంది. చైతూ సినిమా `శైలజారెడ్డి అల్లుడు`, సమంత సినిమా `యూటర్న్` ఇటీవలే విడుదలయ్యాయి. ప్రమోషన్లు ముగించుకుని ఈ జంట స్పెయిన్ వెళ్లిపోయింది. అక్కడో ఐలాండ్‌లో హాయిగా గడుపుతోంది. ఇప్పుడు నాగ్, అమల, అఖిల్.. కూడా అదే ఐలాండ్‌కి వెళ్లబోతున్నారు. అంటే.. నాగ్ ఫ్యామిలీ మొత్తం ఆ ఐలాండ్ లోనే కొన్ని రోజులు ఉండబోతున్నారన్నమాట. అటు నాగ్, ఇటు సమంత చేతిలో బోలెడన్ని సినిమాలున్నాయి. అఖిల్ కి కూడా `మిస్టర్ మజ్ను` షూటింగ్ ఉంది. వాటికి కొంతకాలం బ్రేక్ ఇచ్చి.. ఇలా ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేశాడు నాగ్. కనీసం వారం రోజులు ఐలాండ్‌లోనే ఉండాలని నాగ్ అండ్ ఫ్యామిలీ భావిస్తోంది. అక్కడ్నుంచి తిరిగొచ్చాక.. ఎవరి షూటింగుల్లో వాళ్లు మళ్లీ బిజీ అవుతారు.