దేవదాస్… ఈ పేరు ఎప్పటికీ మర్చిపోలేం. అందులో అక్కినేనినీ మర్చిపోలేం. ఏఎఎన్నార్ చేసిన క్లాసిక్స్ లలో అది మొదటి వరుసలో ఉంటుంది. ఈ పేరుని మరోసారి గుర్తు చేయబోతోంది వైజయంతీ మూవీస్. ఆ దేవదాస్ ఏఎన్నార్ అయితే, ఈ దేవదాస్.. ఆయన వారసుడు అక్కినేని నాగార్జున. నానితో కలసి ఆయన నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రానికి ‘దేవదాస్’ అనే పేరు ఖరారు చేశారు. టైటిల్ లోగోని కొద్దిసేపటి క్రితమే.. విడుదల చేశారు. ఇందులో నాని డాక్టర్‌గా, నాగ్ ఓ మాఫియా డాన్‌గా కనిపించబోతున్న సంగతి తెలిసిందే. వాళ్లిద్దరి పాత్రలకు సింబాలిక్‌గా.. ‘శాంతాబాయ్ మెమొరియల్ ఛారిటీ హాస్పటల్’ అనే డాక్టర్ చిటీపై ఈ టైటిల్‌లోగోని ఉంచారు. లోగో కింద ఓ పిస్తల్ రెండు బుల్లెట్లు చూపించారు. అలా రెండు పాత్రలకూ న్యాయం జరిగినట్టైంది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. అశ్వనీదత్ నిర్మాత.