మల్టీస్టారర్ సినిమా అంటే ముందుకొచ్చే కథానాయకుడు నాగార్జున. ఇప్పుడు కార్తితో ఊపిరి సినిమా చేశారు. ఈనెలలోనే ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇప్పుడు మరో మల్టీస్టారర్‌కీ ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ఈసారి ఆయన సూర్యతో కలసి నటించబోతున్నట్టు టాక్. ఓ ప్రముఖ దర్శకుడు ఇటీవలే నాగ్‌కి ఓ కథ వినిపించారట. అది నాగ్ కి బాగా నచ్చిందని, వెంటనే పచ్చజెండా ఊపేశారని టాక్. తెలుగు, తమిళ భాషలలో ఏక కాలంలో తెరకెక్కే చిత్రంలో మరో కథానాయకుడిగా సూర్య నటించనున్నాడు. సూర్య కూడా కార్తిలానే తెలుగులో ఓ సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకొంటున్నాడు. త్రివిక్రమ్‌తో ఓ సినిమా కూడా ఓకే అయ్యింది. ఈలోగానే నాగ్తోనూ సినిమా ఒప్పేసుకొన్నాడు. చూస్తుంటే ఈ అన్నాదమ్ములిద్దరూ తెలుగులో పాగా వేయాలని గట్టిగానే నిర్ణయించుకొన్నట్టుంది.