రాంగోపాల్ వర్మ – పూరి జగ్ననాథ్… ఇద్దరూ దేశ ముదుర్లే. `పనైపోయింది` అనుకుంటున్న సమయంలోనే ఓ బంపర్ ఆఫర్ కొట్టేస్తుంటారు. వర్మని తెలుగులో ఎవరూ పట్టించుకోరు అనుకునే సమయంలో నాగార్జున `ఆఫీసర్` ఆఫర్ ఇచ్చాడు. సేమ్ టూ సేమ్ శిష్యుడు పూరి కి కూడా నాగ్ ఇలాంటి ఆఫరే అందించినట్టు సమాచారం. సూపర్, శివమణి… ఇవి రెండూ నాగ్ – పూరి కాంబోలో వచ్చిన సినిమాలు. రెండూ ఆడింది అంతంత మాత్రమే. అయితే ఇప్పుడు ముచ్చటగా మూడో ఆఫర్ ఇచ్చాడట. ఇటీవల పూరి నాగ్ని కలసి ఓ కథ వినిపించాడని, అది నాగ్‌కి బాగా నచ్చిందని, దాంతో ఈ కాంబో ఖాయమైందని టాలీవుడ్ టాక్. ప్రస్తుతం నానితో కలసి ఓ మల్టీస్టారర్‌లో నటిస్తున్నాడు నాగ్. ఆ వెంటనే బంగార్రాజు ఉంటుంది. బంగార్రాజు పూర్తయ్యాక పూరితో కాంబో ఉండొచ్చు. ఈలోగా ఆకాష్ పూరితో ఓ సినిమా చేస్తాడు పూరి. ఆ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా సరే, నాగ్‌తో సినిమా మాత్రం గ్యారెంటీ అన్నది టాలీవుడ్ వర్గాల టాక్.