నాగచైతన్య లవ్ లో ఉన్నాడని, తెలుగు పరిశ్రమకు చెందిన ఓ కథానాయికతో పీకల్లోతు ప్రేమలో పడిపోయాడని, వాళ్లిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారన్న గాసిప్పులు గుప్పుమన్నాయి. అయితే ఆ పెళ్లి చైతూ ఇంట్లో వాళ్లకు ఇష్టం లేదని కూడా రూమర్లు వచ్చాయి. అయితే.. ఇంట్లో తన పంతం నెగ్గించుకొన్నాడు చైతూ. తన పెళ్లికి పచ్చజెండా ఊపేశారు నాగార్జున, అమల. దాంతో నాగచైతన్య రూట్ క్లియర్ అయిపోయింది. ”చైతూ కోరుకొన్న అమ్మాయితోనే తన పెళ్లి జరుగుతుంది. చైతూ డిసీజన్ పై మా అందరికీ నమ్మకం ఉంది” అంటూ నాగార్జున తన సన్నిహితుల దగ్గర వ్యాఖ్యానించారని టాక్.
అతి త్వరలో నాగ్ నుంచి చైతూ పెళ్లి విషయమై ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు రావొచ్చని తెలుస్తోంది. అంతేకాదు… అఖిల్ కూడా ప్రేమలో పడ్డాడన్న వార్తలు వచ్చాయి. వాటినీ నాగ్ ధృవీకరించే అవకాశం ఉంది. తన ఇద్దరు వారసుల పెళ్లికి సంబంధించి నాగ్ అతి తొందర్లోనే ప్రతిస్పందిస్తాడని అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం.