నాగార్జున ఇప్పుడు సెంచరీ సినిమాకి దగ్గర పడ్డారు. లెక్క ప్రకారం చూస్తే ‘ది ఘోస్ట్’ తన 99వ సినిమా. త్వరలో మోహన్ రాజాతో ఓ సినిమా చేయబోతున్నారు. అది వందో సినిమా అవుతుంది. అయితే.. వందో సినిమాగా మోహన్ రాజా సినిమాని ప్రకటించాలా? వద్దా? అనే కన్ఫ్యూజన్లో ఉన్నారు నాగ్. ఎందుకంటే… ఈ 99లో కొన్ని గెస్ట్ రోల్స్ పాత్రలున్నాయి. ‘స్టైల్’లాంటి సినిమాల్లో నాగ్ అతిథి పాత్రల్లో కనిపించారు. వీటిలోనే కొన్ని హిందీ సినిమాలున్నాయి. వాటిని కలపాలా? వద్దా? అనే డైలామాలో ఉన్నాడు నాగ్. అన్నీకలుపుకొని, వందో సినిమా అని మొదలెడితే.. దాన్ని ఓ మైల్ స్టోన్ మూవీలా తీయాల్సిందే. ఆ సినిమాపై అంచనాలు ఏర్పడతాయి. వాటిని అందుకోపోతే… అభిమానులు నిరుత్సాహానికి గురవుతారు. పైగా ఓ మైల్ స్టోన్ సినిమాని గుర్తిండిపోయేలా తీర్చిదిద్దలేకపోయినందుకు నాగ్ కూడా చింతించాల్సి ఉంటుంది. అందుకే ప్రస్తుతం వంద అనే నెంబర్ గురించి నాగ్ ఆలోచించడం లేదని తెలుస్తోంది. నాగ్ తదుపరి సినిమా మోహన్ రాజాతోనే. కాకపోతే.. దాన్ని వందో సినిమాగా ప్రకటించాలనుకోవడం లేదు. అవుట్ పుట్ చూశాక.. అప్పుడు అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారు. ఒకవేళ.. అది కూడా ఆశించినట్టు రాకపోతే..గెస్ట్ రోల్స్ చేసిన సినిమాలన్నీ పక్కన పెట్టి, కొత్తగా వందో సినిమా గురించి ప్రణాళికలు వేసుకొంటారు. అదీ.. నాగ్ ప్లానింగ్.