ఫ్లాప్స్, ఫెయిల్యూర్ గురించి మాట్లాడడానికి ఎవ్వరూ ఇష్టపడరు. డెమీ గాడ్స్ రేంజ్లో కీర్తింపబడుతూ ఉండే ఫిల్మ్ స్టార్స్ అయితే అస్సలు మాట్లాడరు. అందుకే ప్లాప్స్ గురించి హీరోలు మాట్లాడినప్పుడు గొప్పగా అనిపిస్తుంది. వాళ్ళపైన అభిమానం పెరుగుతుంది. ఈ విషయంలో అందరికంటే కూడా పవన్ కళ్యాణ్ చాలా ముందుంటారు. జానీతో సహా తన ఫ్లాప్ సినిమాలన్నింటి గురించి చాలా ఓపెన్‌గా మాట్లాడేశాడు పవన్. అలాగే జనతా గ్యారేజ్ ప్రమోషన్స్ టైంలో ఎన్టీఆర్ కూడా తన తప్పులు, ఫ్లాప్స్ గురించి మెన్షన్ చేశాడు. అలాగే నాగార్జున కూడా భాయ్ సినిమా నుంచి ఫెయిల్యూర్స్ గురించి ఓపెన్‌గానే మాట్లాడేస్తూ ఉన్నాడు. అయితే నాగార్జున మాటలు మాత్రం ఆ సినిమాల డైరెక్టర్స్‌ని సివియర్‌గా హర్ట్ చేస్తున్నాయి. సినిమా ఫ్లాప్ అయింది. నా జడ్జ్మెంట్ రాంగ్ అయింది, మళ్ళీ అలాంటి మిస్టెక్స్ చేయను అనేలాంటి మాటలు బాగుంటాయి కానీ నాగార్జున మాత్రం అసలు ఆ సినిమాలని కనీసం గుర్తించను అనేలా మాట్లాడేస్తున్నాడు. అందులో తన తప్పు గురించి మాత్రం అస్సలు మాట్లాడడం లేదు.
భాయ్ సినిమాకు ముందు వీరభద్రం చౌదరి అనుభవం ఎంత? ఇచ్చిన హిట్ సినిమాలు ఎన్ని? అయినప్పటికీ ఓ రెండు ఎబౌ యావరేజ్ సినిమాలు ఇచ్చిన డైరెక్టరే కాబట్టి నాగార్జున లాంటి స్టార్ హీరోతో చేసే అవకాశమంటే చాలా తక్కువ రెమ్యూనరేషన్‌కే సినిమా చేస్తాడన్న ఉద్ధేశ్యంతో వీరభద్రంని ఒకె చేశాడు నాగ్. అలాగే కామెడీని పండించడంలో విషయమున్నవాడే కాబట్టి ఓ మంచి కథ ఉంటే చాలు. మేనేజ్ చేసెయ్యొచ్చు అనుకున్న నాగార్జున సినిమా చేయడానికి రెడీ అయిపోయాడు. ‘భాయ్’ కథ వీరభద్రం కంటే కూడా నాగార్జునకే ఎక్కువ నచ్చి ఉంటుందనడంలో సందేహం లేదు. ఎందుకంటే వీరభద్రంకి నచ్చినంత మాత్రాన నాగార్జున ఆ కథలో యాక్ట్ చేయడు. అదే నాగార్జునకు కథ నచ్చితే మాత్రం ఆ కథను డైరెక్ట్ చేయడానికి వీరభద్రం రెడీ అయిపోతాడు. స్టార్డంతో వచ్చే ఈక్వేషన్స్ ఇలానే ఉంటాయి. ఆ తర్వాత కూడా కథనం, సీన్స్, తన క్యారెక్టరైజేషన్, సాంగ్స్, ఫైట్స్…..అన్నీ కూడా నాగార్జునకు నచ్చినట్టుగానే తెరకెక్కి ఉంటాయి. తీరా సినిమా డిజాస్టర్ అయ్యాక మాత్రం నాగార్జున ఆ సినిమా నుంచి పూర్తిగా దూరం జరగడానికి ప్రయత్నం చేశాడు. ఫెయిల్యూర్ క్రెడిట్ మొత్తం వీరభద్రం అకౌంట్లో వేసేశాడు. వీరభద్రం టాలెంట్ ఎంత అన్న విషయం పక్కన పెడితే నాగ్ ఎఫెక్ట్ వీరభద్రం కెరీర్పైన బాగానే పడింది.
‘అఖిల్’ సినిమా స్టోరీ కూడా సేం టు సేం. బెల్లంకొండ శ్రీనివాస్‌ని ‘అల్లుడు శీను’ సినిమాతో సక్సెస్‌ఫుల్‌గా మాస్ జనాలకు దగ్గర చేసిన వినాయక్ పనితనం నాగ్‌కి నచ్చింది. అక్కినేని ఫ్యామిలీ మొత్తం హీరోలలో మాస్…ఊరమాస్ ప్రేక్షకులకు బాగా దగ్గరైన హీరో ఒక్కరు కూడా లేరు. అందుకే అఖిల్‌ని మాస్ ప్రేక్షకులకు రీచ్ అయ్యేలా చేయాలనుకున్నాడు. అందుకు అవసరమైన ఫైట్స్, డ్యాన్సింగ్ స్కిల్స్ విషయంలో మాంచి ట్రైనింగ్ ఇప్పించాడు. మొదటి సినిమాతోనే అఖిల్‌ని సూపర్ హీరోగా ప్రజెంట్ చేయాలన్న టార్గెట్‌తో విశ్వాన్ని కాపాడటానికి బయల్దేరిన కథానాయకుడి కథను నాగార్జునే ఫైనల్ చేశాడు. నాగ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నచ్చాకే ఆ కథను వినాయక్ కూడా ఒకె చేశాడు. ఆ తర్వాత కూడా చాలా విషయాలను నాగార్జునే స్వయంగా చూసుకున్నాడన్నది వాస్తవం. కానీ రిజల్ట్ మాత్రం ‘భాయ్’ సినిమాను తలపించింది. ఇప్పుడు అఖిల్ విషయంలో కూడా నాగార్జున మాటలు సేం టు సేం అన్నట్టుగా ఉన్నాయి. ‘అఖిల్’ సినిమా అంటేనే అదేదో పాపం అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అలాగే అఖిల్‌ని విక్రమ్ కుమార్ డైరెక్షన్లో ఇంట్రడ్యూస్ చేయాల్సింది. బట్ కుదరలేదు. అందుకే అఖిల్ లాంచింగ్ సినిమా ఇదేనని అనుకోండి అని చెప్తున్నాడు. ఈ మాటలన్నీ కూడా వినాయక్‌తో పాటు వినాయక్ అభిమానులను కూడా బాధించేవే. అఖిల్ రిలీజ్ అయిన వెంటనే ఆ ఫెయిల్యూర్ మొత్తానికి తనదే బాధ్యత అని వినాయక్ ఒప్పుకున్నాడు. ఆ విషయంలో వినాయక్‌ని చాలా మంది ప్రశంసించారు కూడా. అయినప్పటికీ నాగ్ మాత్రం వినాయక్‌ని హర్ట్ చేసేలా మాట్లాడుతున్నాడు. ‘అఖిల్’ని మర్చిపోయి మెగాస్టార్ 150వ సినిమా కోసం డే అండ్ నైట్ కష్టపడుతున్న సీనియర్ డైరెక్టర్ వినాయక్‌ని హర్ట్ చేసేలా మాట్లాడడం నాగ్‌కి తగదని కొంతమంది సీనియర్ డైరెక్టర్సే అభిప్రాయపడుతున్నారు. రామ్ గోపాల్ వర్మతో సహా ఎంతోమంది కొత్త డైరెక్టర్స్‌కి లైఫ్ ఇచ్చిన నాగార్జున స్థాయికి ఈ మాటలు అస్సలు కరెక్ట్ కాదు.