రిలీజ్‌కి ముందు కాస్త పాజిటీవ్ బజ్ తెచ్చుకొన్న `రామారావు ఆన్ డ్యూటీ` మొదటి రోజు, మొదటి షోకే చతికిల పడిపోయింది. ఈ సినిమాని డిజాస్టర్ అని రివ్యూలు తేల్చేశాయి. థియేటర్ల బయట ఫ్యాన్స్ అయితే…`ఆ దర్శకుడు ఎవరో కనిపిస్తే కొడతాం` అంటూ ఆవేశంగా రెచ్చిపోతున్నారు. రవితేజకు సూటయ్యే కథ ఇది కాదన్నది అందరి మాట. నిజానికి దర్శకుడు శరత్ మాండవ మైండ్‌లో ఉన్న హీరో రవితేజ కాదు… నాగార్జున. ఈ కథని ముందు వినిపించింది నాగ్‌కే.
నాగ్ కి ఈ కథ నచ్చింది. కాకపోతే… `నాకంటే కాస్త యంగ్ హీరో అయితే బాగుంటుంది. ఫ్లాష్ బ్యాక్ లో లవ్ స్టోరీ ఎపిసోడ్ కి అది హెల్ప్ అవుతుంది` అని సలహా ఇచ్చాడట. దాంతో నాగార్జునని వదిలి.. రవితేజని ఎంచుకొన్నాడు. నిజానికి రవితేజ నుంచి ఆశించే ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాలో బొత్తిగా లేదు. ఇలాంటి సీరియస్ డ్రామాలో రవితేజని చూడలేకపోయారు జనాలు. నిజానికి నాగ్ చేసుంటే.. కాస్తో కూస్తో బెటర్ రిజల్ట్ వచ్చేదేమో,..? రవితేజ కెరీర్లో మరో అట్టర్ ఫ్లాప్ రాసుంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు?