నాగచైతన్య సినిమా అంటే నాగార్జున హడావుడి మామూలుగా ఉండేది కాదు. అసలు తనకు సంబంధం లేకపోయినా ప్రెస్ మీట్లు పెట్టి మరీ మాట్లాడేవాడు. ఎడిటింగ్రూమ్ లోనూ నాగ్‌దే హడావుడి. ప్రీ రిలీజ్ ఫంక్షన్లో నాగ్ హాజరు తప్పని సరి. సమంత, అఖిల్… వీళ్లంతా టంచనుగా హాజరైపోయేవారు.
అయితే `వెంకీ మామ`కి మాత్రం ఈ హడావుడి ఏం కనిపించడం లేదు. ఈ సినిమా గురించి నాగ్ ఒక్కసారి కూడా మాట్లాడలేదు. కనీసం ట్విట్టర్లో ఓ పోస్టింగు కూడా లేదు. ఈ సినిమాకి సంబంధించి రెండు పెద్ద ఫంక్షన్లు జరిగాయి. ప్రి రిలీజ్ వేడుకతో పాటు, మ్యూజికల్ నైట్అంటూ మరో కార్యక్రమం నిర్వహించారు. ఈ రెండింటికీ నాగ్ హాజరు కాలేదు. సమంత కూడా రాలేదు. అఖిల్ సంగతి సరే సరి. ‘ఇది దగ్గుబాటి ఫ్యామిలీ సినిమా’ అని లైట్ తీసుకున్నారా? లేదంటే ‘ఈ సినిమా గురించి మాట్లాడేవాళ్లు ఎక్కువమందే ఉన్నారు కదా..’ అంటూ పట్టించుకోలేదా? అనేదే అర్థం కావడం లేదు. వెంకీతో నాగ్‌కి సంబంధాలు బాగానే ఉన్నాయి. ఈమధ్య దగ్గుబాటి ఫ్యామిలీతో సమంత కలివిడిగానే ఉంటోంది. మరి ఈ గ్యాప్ ఎందుకొచ్చిందో..?