నాగార్జున కొత్త కథలపై దృష్టిపెట్టారు. సీనియర్ దర్శకులతోపాటు, కొత్తతరం నుంచీ ఆయన కథలు వింటున్నారు. ‘గాడ్‌ఫాదర్’ ఫేమ్ మోహన్రాజాతోపాటు, మరో రచయిత చెప్పిన కథకి సంబంధించి ప్రస్తుతం చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. ఈ క్రమంలో మనం ఫేమ్ విక్రమ్ కె.కుమార్ పేరు కూడా వినిపించింది. అన్నట్టు.. డైలాగ్ రైటర్ ప్రసన్న కుమార్ కూడా నాగ్ కు ఓ కథ చెప్పారు. ఇది పిరియాడికల్ డ్రామా ఉండబోతుందని తెలిసింది.
వీళ్లు చెప్పిన ఏదో ఒక కథతో వచ్చే ఏడాదిలో సినిమా షురూ అయ్యే అవకాశాలున్నాయనేది పరిశ్రమ వర్గాలు చెబుతున్న మాట. ప్రస్తుతం ఎదో ఒక కొత్త పాయింట్ వుంటే గానీ ప్రేక్షకులు థియేటర్ లోకి రావడం లేదు. ప్రేక్షకులని థియేటర్ లోకి తీసుకురావడానికి ఆకర్షించే పాయింట్ ఎదో వుండాలి. అలాంటి కథతోనే సినిమా చేయాలనే ఆలోచనలో వున్నారు నాగార్జున.