నాగార్జున కెరీర్ మరీ ఒడిదుడుకుల్లో ఏమీ లేదు. ఆఫీసర్ సినిమాను పక్కన పెడితే మరీ భయంకరమైన డిజాస్టర్లు కూడా లేవు. అయినా మార్కెట్ మాత్రం అంతంత మాత్రమే అన్నది బయ్యర్ల పాయింట్. అందుకే నాగ్ లేటెస్ట్ సినిమా ‘మన్మధుడు 2’ ను ఆంధ్ర ఏరియాకు జస్ట్ ఏడు కోట్ల రేషియోలో ఇచ్చేసారు. ఆంధ్రలోని కృష్ణ, వైజాగ్ ఎలాగూ స్వంత విడుదలే.
నాని, విజయ్, శర్వా లాంటి యంగ్ హీరోల మార్కెట్ ఆంధ్రలో పది కోట్ల వరకు వుంది. అలాంటిది రకుల్ ప్రీత్ సింగ్ అందాల ఆరబోత, నాగ్ ఎవర్ గ్రీన్ హిట్ మన్మధుడు సిరీస్ లో సినిమా అన్న టాక్, మంచి టీజర్, ట్రయిలర్ అన్నీ వున్నా, ఏడు కోట్ల రేంజ్ లోనే ఇవ్వాల్సి వచ్చింది.
ఆఫ్ కోర్స్ దీన్ని నాగ్ మరో విధంగా కవర్ చేసుకున్నాడు. సినిమా ట్రయిలర్ విడుదల ఫంక్షన్ లో తానే తక్కువ రేట్లకు ఇవ్వమన్నానని, నిర్మాతే కాదు, బయ్యర్లు కూడా బాగుండాలని చెప్పుకొచ్చాడు.
అయినా ఈ మధ్య నిర్మాతలు కాస్త తక్కువకు ఇవ్వడం అన్న స్ట్రాటజీ కూడా తీసుకున్నది వాస్తవం. ఎక్కువకు ఇచ్చి, సినిమా డిజాస్టర్, బయ్యర్లు మునిగిపోయారు అన్న టాక్ వెంటనే బయటకు రావడం, దాంతో సినిమాకు మరింత నెగిటివ్ కావడం జరుగుతోంది. అదే కాస్త తక్కువకు ఇచ్చి, ఏదో విధంగా ఓవర్ ఫ్లోస్ రాబట్టుకుంటే బెటర్ అని పెద్ద కంపెనీలు భావిస్తున్నాయి.
విజయ్ క్రేజ్ వుండి కూడా మైత్రీ మూవీస్ ఆంధ్రలో డియర్ కామ్రేడ్ ను 9 నుంచి 10 కోట్ల రేషియోలో ఇచ్చేసింది. అదే సంస్థ చిత్రలహరి సినిమాను అయిదు కోట్లకు పైగా రేషియోలో ఆంధ్రకు ఇచ్చేసింది. దానివల్ల సినిమా యావరేజ్ అయినా బయ్యర్లు సేఫ్ అవుతారు. సినిమాకు నెగిటివ్ ఎక్కువ రాకుండా వుంటుంది.
సినిమా రంగంలో వున్న కట్టుబాటు ప్రకారం, ఎక్కువకు ఇచ్చి, లాస్ అయితే మళ్లీ నిర్మాతే తరువాత సినిమాకు సర్దుబాటు చేయాల్సి వుంటుంది. ఈ తలకాయ నొప్పి అంతా ఎందుకని ముందే కాస్త రీజనబుల్ గా ఇచ్చేస్తున్నారు.