ఈ దసరాకి మూడు సినిమాలొచ్చాయి. గాడ్‌ఫాదర్, ది ఘోస్ట్, స్వాతిముత్యం. గాడ్ ఫాదర్‌కి వసూళ్లు బాగున్నాయి. స్వాతి ముత్యంకి రివ్యూలు బాగా వచ్చాయి. ది ఘోస్ట్ కి ఇవి రెండూ లేవు. ఈ దసరా పండగ నాగ్ ని నిరుత్సాహంలో ముంచెత్తింది. అయినా…అ ందులోనూ నాగ్ కి ఓ హ్యాపీ మూమెంట్ ఉంది. అది.. `గాడ్ ఫాదర్` హిట్ అవ్వడమే. గాడ్ ఫాదర్ దర్శకుడు మోహన్ రాజా… నాగార్జునకు ఓ కథ చెప్పాడు. అది మల్టీస్టారర్. ఇందులో నాగార్జున, అఖిల్ కలిసి నటిస్తున్నారు. కాకపోతే.. నాగ్ ఇంకా ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. `గాడ్ ఫాదర్` రిజల్ట్ చూసి ముందుకెళ్లాలని ఆయన భావించారు. ఇప్పుడు గాడ్ ఫాదర్ హిట్టవ్వడంతో…నాగ్ కి మోహన్ రాజాపై మరింత నమ్మకం కుదిరింది. ఈసారి.. `నో` చెప్పడానికి ఆయనకు కారణాలేం లేనట్టే. ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్టు రెడీగా ఉంది కాబట్టి, వీలైనంత త్వరగా పట్టాలెక్కే ఛాన్సుంది. నాగ్ మాత్రం `ది ఘోస్ట్` తరవాత కొంత కాలం విశ్రాంతి తీసుకోవాలని ఫిక్సయ్యాడు. ఈలోగా.. ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకోవొచ్చు. మరోవైపు మోహన్ రాజా.. మహేష్ బాబుకి కూడా ఓ కథ చెప్పాడు. కాకపోతే.. అప్పట్లో వర్కవుట్ కాలేదు. కథ నచ్చినా మోహన్ రాజాతో సినిమా చేసే సమయం ఇప్పుడు మహేష్ దగ్గర లేదు. ఎందుకంటే ప్రస్తుతం త్రివిక్రమ్ తో ఓ సినిమా చేస్తున్నాడు మహేష్. ఆ వెంటనే రాజమౌళి సినిమా మొదలైపోతుంది.