నో’… శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రూపొందుతోన్న మల్టీస్టారర్‌లో నాగార్జున, మీరూ అన్నదమ్ములుగా నటిస్తున్నారా? అని అడిగిన ప్రశ్నకు నాని చెప్పిన ఆన్సర్. స్పష్టంగా కాదని చెప్పారు.
ఇంకా నాని మాట్లాడుతూ “అన్నదమ్ములుగా నటించడం లేదు. ‘కృష్ణార్జున యుద్ధం’లో రెండు పాత్రలు చేశా. వాళ్లూ అన్నదమ్ములు కాదు. శ్రీరామ్ ఆదిత్య సినిమాలో నేను, నాగార్జునగారు అన్నదమ్ములుగా నటించడం లేదు. ఆ సినిమా గురించి తరవాత మాట్లాడతా. ప్రస్తుతం నాగార్జునగారితో షూటింగ్ చేయడాన్ని ఎంజాయ్ చేస్తున్నా” అన్నారు. అంతకు మించి అయన ఒక్క ముక్క ఎక్కువ మాట్లాడలేదు. సినిమాలో నాగార్జున డాన్‌గా, నాని డాక్టర్‌గా నటిస్తున్నారని వచ్చిన వార్తల గురించీ మాట్లాడలేదు.
ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఇటీవలే నాగార్జున, నానిలపై ఓ పాటను చిత్రీకరించారు. అంతకు ముందు షెడ్యూల్లో నాని, అతనికి జోడీగా నటిస్తున్న రష్మికా మండన్న, సంపూర్ణేష్ బాబులపై మెట్రోలో సన్నివేశాలు తీశారు. రేపు ‘కృష్ణార్జున యుద్ధం’ విడుదల సందర్భంగా షూటింగ్ నుంచి నాని రెండు మూడు రోజులు విశ్రాంతి తీసుకున్నట్టు టాక్.