ప్రయోగాలంటే నాగార్జున ఎప్పుడూ ముందే ఉంటాడు. కాకపోతే ఈమధ్య తను కూడా కమర్షియల్ రుచినే మరిగాడు. చాలాకాలం తరవాత నాగ్ మళ్లీ తన బాటలోనే వెళ్లి ఓ ప్రయోగం చేయబోతున్నాడు. నాగ్ కథానాయకుడిగా మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. సాల్మన్ దర్శకుడు. ఈ చిత్రానికి `వైల్డ్ డాగ్` అనే విచిత్రమైన పేరు పెట్టారు. ఇందులో నాగార్జున ఎన్కౌంటర్ స్పెషలిస్టు విజయ్ వర్మ గా నటిస్తున్నాడు. ఫస్ట్‌లుక్ కొద్దిసేపటి క్రితం విడుదలైంది.
2009 నేపథ్యంలో సాగే కథ ఇది. సాల్మన్ ఈ చిత్రాన్ని రియలిస్టిక్ అప్రోచ్‌లో తెరకెక్కిస్తున్నాడు. ప్రతీ సన్నివేశం సహజత్వానికి దగ్గరగా ఉండబోతోంది. 2009 సమయంలో జరిగిన ఓ ఎన్కౌంటర్ ఆధారంగా ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది.