`వైల్డ్ డాగ్` తప్ప నాగార్జున చేతిలో సినిమాలేం లేవు. ధనుష్ తో చేయాలనుకున్న మల్టీస్టారర్ కూడా మళ్లీ పట్టాలెక్కించే కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. ఈలోగా నాగ్ మరో ప్రాజెక్టు ఓకే చేశాడు. ప్రవీణ్ సత్తారు చెప్పిన కథకు నాగ్ ఫ్లాట్ అయ్యాడు. వీరిద్దరి కాంబో ఖాయమైంది. ఈ చిత్రాన్ని ఏసియన్ సునీల్ తెరకెక్కిస్తారు. నాగచైతన్యతో లవ్ స్టోరీని తెరకెక్కిస్తోంది ఈ సంస్థే. ఇప్పుడు నాగార్జునతో కూడా సినిమా ఓకే చేసింది. గరుడ వేగ లాంటి హిట్ తరవాత.. ప్రవీణ్ సత్తారు చేస్తున్న సినిమా ఇది. ఈసారి కూడా అండర్ కవర్ ఆపరేషన్ లాంటి సబ్జెక్ట్ తో ప్రవీణ్ సత్తారు వస్తున్నాడని సమాచారం. ఈ కథలో బోలెడంత యాక్షన్ స్కోప్ ఉందని తెలుస్తోంది. ఈమధ్య ఎందుకనో నాగార్జున యాక్షన్ కథలవైపు దృష్టి సారిస్తున్నాడు. `వైల్డ్ డాగ్` కూడా యాక్షన్ మూవీనే. ప్రవీణ్ సత్తారు కొత్త సినిమా గురించి అధికారికంగా త్వరలోనే ఓ ప్రకటన రానుంది.