‘నా సామిరంగ’తో ఓ మాస్ హిట్ అందుకొన్నారు నాగార్జున. ప్రస్తుతం ‘కుబేర’లో నటిస్తున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన చిత్రమిది. ధనుష్ కథానాయకుడు. సోలో హీరోగా నాగ్ సినిమా ఒకటి పట్టాలెక్కాల్సివుంది. సెప్టెంబరులో మొదలై, ఈ సంక్రాంతికి విడుదల చేయాలని చూశారు. కానీ.. కుదర్లేదు. సంక్రాంతి తరవాత మాత్రం నాగార్జున సోలో హీరోగా ఓ సినిమా సెట్స్‌పైకి వెళ్తుందని సమాచారం అందుతోంది. ఓ యువ దర్శకుడు చెప్పిన కథకు నాగ్ పచ్చజెండా ఊపారని సమాచారం. ఆ దర్శకుడే హర్ష.
‘హుషారు’ సినిమాతో ఆకట్టుకొన్నారు హర్ష. ఆ సినిమా యూత్ కి బాగా నచ్చింది. ఇటీవల విడుదలైన ‘ఓం భీమ్ భుష్’ కూడా బాక్సాఫీసు దగ్గర ఓకే అనిపించుకొంది. ఇప్పుడు నాగ్ కోసం ఓ కథ సిద్ధం చేశారని, కింగ్ కూడా ఈ కథ నచ్చి… సినిమా చేయడానికి ముందుకొచ్చారని సమాచారం అందుతోంది. ప్రస్తుతం స్క్రిప్టు పనులు జరుగుతున్నాయి. జనవరిలో ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించే అవకాశం ఉంది. పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి.