రామ్ గోపాల్ వర్మ… దర్శకుడిగా పరిచయమైన ‘శివ’తో తెలుగు సినిమాకి కొత్త నడక నేర్పిన దర్శకుడు. అయితే… ఆయన కొత్తగా సినిమాలు తీయడం మానేసి చాలా రోజులైంది. కథలు దగ్గర్నుంచి కెమెరా యాంగిల్స్ వరకూ ఇటీవల వర్మ తీసిన సినిమాల్లో ఏదీ కొత్తగా వుండడడం లేదనేది ప్రేక్షకుల నుంచి వినిపించే విమర్శ. ఇటువంటి సమయంలో నాగార్జున వర్మకు అవకాశం ఇవ్వగానే ప్రేక్షకుల్లో ఏదో మూలన ఆశలు చిగురించాయి. మళ్లీ పాత వర్మను చూడవచ్చని అనుకున్నారు. మధ్యలో ఈ సినిమా మీద కాన్సంట్రేట్ చేయడం మానేసి, ‘జీఎస్టీ’ అంటూ స్టూడియోల చుట్టూ తిరిగినప్పుడు వాళ్ల ఆశలు అడియాసలు అయ్యే అవకాశాలు చూచాయగా కనిపించాయి. తరవాత స్టిల్స్ వచ్చాయి. ఎక్కడో తేడా కొడుతుందేమో అనే అనుమానం వచ్చింది. టీజర్ వచ్చాక అనుమానాల్లేవ్. అంతా క్లియర్. మరో రొటీన్ పోలీస్ వర్సెస్ గ్యాంగ్స్టర్, మాఫియా సినిమా తీశాడని ఓ అంచనాకు వచ్చేశారు. ప్రేక్షకుల్లో ఆశించిన బజ్ రాలేదని నాగార్జున అండ్ కో గమనించినట్టున్నారు. కొత్తగా మరో టీజర్ రిలీజ్ చేశారు. ఇందులోనూ కొత్త ఏముంది? అని చూస్తే ఏమీ లేదు. వర్మ మార్క్ టేకింగ్ తప్ప. ఈ నెల 12న ట్రైలర్ విడుదల చేస్తార్ట. అదెలా వుంటుందో చూడాలి.