‘చి.ల.సౌ’తో దర్శకుడిగా రాహుల్ రవీంద్రన్ హిట్ అందుకున్నాడు. అక్కినేని మేనల్లుడు సుమంత్‌కి హీరోగా జెన్యూన్ హిట్ ఇచ్చాడు. మొన్న శుక్రవారం విడుదలైన రొమాంటిక్ కామెడీకి ఇండియాలోనూ, ఓవర్సీస్లోనూ హిట్ టాక్ వచ్చింది. అయితే… ప్రేక్షకులు సినిమా హిట్ అని డిక్లేర్ చేయడానికంటే ముందే రాహుల్ రవీంద్రన్ జాక్‌పాట్ కొట్టాడు. అదేనండీ… అన్నపూర్ణ స్టూడియోస్‌లో దర్శకుడిగా తన రెండో సినిమా చేయడానికి అడ్వాన్స్ అందుకున్నాడు. ఈ సంగతి అందరికీ తెలిసిందే. అయితే… అతను అందుకున్న మొత్తం ఎంతో తెలుసా? అక్షరాలా పాతిక లక్షలు! ‘చి.ల.సౌ’ విడుదలకు ముందే చూసిన నాగార్జున, నాగచైతన్య తమ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా సినిమాను విడుదల చేయడానికి అగ్రిమెంట్ చేసుకున్నారు. ‘చి.ల.సౌ’ చూసిన వెంటనే నెక్ట్స్ సినిమా తమకే చేయాలని రాహుల్ రవీంద్రన్ చేతిలో నాగార్జున పాతిక లక్షల చెక్ అడ్వాన్స్‌గా పెట్టారట! దర్శకుడిగా మొదటి సినిమాకి రాహుల్ అందుకున్న రెమ్యునరేషన్ కంటే ఈ అడ్వాన్స్ ఎక్కువట! డబ్బుకి డబ్బు… డబ్బుకి తోడు పేరున్న సంస్థలో సినిమా చేసే అవకాశం రావడంతో సరేనన్నాడు. ప్రస్తుతం అతని దగ్గరున్న రెండు మూడు లైన్లను డెవలప్ చేసి నాగార్జునకు వినిపిస్తే… తమ ఫ్యామిలీ హీరోల్లో ఎవరికి సూటవుతుందని అనుకుంటే వారితో సినిమా చేస్తారట! ఈ ఎపిసోడ్లో సమంతకు రాహుల్ రవీంద్రన్ థ్యాంక్స్ చెప్పాలి. స్నేహితుడి కోసం సినిమా చూసి, ఆ తర్వాత బావుందని కుటుంబ సభ్యులకు చెప్పిందామె కదా!!