సాధారణంగా సినిమా జనాలు విడుదల ముందు తిరుపతి వెళ్లడం, కాలినడకన కొండ ఎక్కడం ఇలాంటివి అన్నీ చేస్తుంటారు. ఓ పనికి ముందు విజయం రావాలని భగవంతుడిని కోరుకోవడం సహజం. అయితే హీరో నాగార్జున ఒక్కోసారి మొహమాటం లేకుండా మాట్లాడేస్తుంటారు. మిస్టర్ మజ్ఞు సినిమా ప్రమోషన్ కోసం అఖిల్ తో కలిసి ఓ విడియో చేసారు. ఈ విడియోలో నాగ్ ఇలాగే మాట్లాడారు.
తిరుపతి వెళ్తున్నావట కదా, కాలినడకన కొండ ఎక్కుతున్నావంట అంటూ కొడుకును అడిగారు. దానికి అఖిల్ అవును అంటూ సమాధానం ఇచ్చారు. అప్పుడు నాగ్ మాట్లాడుతూ, సినిమా బాగుంటేనే ఆ పెద్దాయిన వెంకటేశ్వర స్వామి అయినా కరుణించేది. బాగా లేకుంటే ఆయన కూడా ఏమీ చేయడు, అంటూ నవ్వుతూ కామెంట్ చేసారు.
మళ్లీ ఆ వెంటనే, బాగా చేసారా? అని వాకబు చేసారు. ‘బాగా చేసాం’ అని అఖిల్ చెప్పగానే, అయితే ఓకె అని నవ్వేసారు.