నాగచైతన్య, సమంతలు విడిపోవటం దురదృష్టకరమని అన్నారు నాగచైతన్య తండ్రి అక్కినేని నాగార్జున. చై-సామ్‌లు విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. కొడుకు కోడలు విడాకులపై నాగార్జున ట్విటర్ వేదికగా స్పందించారు.
”బరువెక్కిన హృదయంతో చెబుతున్న. సామ్, చైలు విడిపోవటం దురదృష్టకరం. భార్యాభర్తల మధ్య ఏం జరిగినా అది వాళ్ల పర్శనల్. సమంతతో నా కుటుంబం గడిపిన ప్రతి మూమెంట్ వెరీ స్వీట్. సామ్ మా కుటుంబానికి చాలా దగ్గరైంది. దేవుడు వాళ్లిద్దరికీ మనో ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నా.’’ అని రాసుకొచ్చారు నాగార్జున.
కొద్ది రోజులుగా సమంత – నాగ చైతన్య విడాకుల అంశం హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ఇప్పుడు విడాకుల విషయాన్ని నాగ చైతన్య-సామ్ అధికారికంగా ప్రకటించాడు. ‘ఏం మాయ చేశావే’ సినిమాలో తొలిసారిగా కలసి నటించారు చైతు సామ్. అప్పుడే వీరి మధ్య స్నేహం చిగురించింది. 2017లో వివాహం అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. అయితే వీరి వివాహ బంధం ఐదేళ్ళు కూడా నిలవలేకపోయింది.